సినిమా

బాలీవుడ్ సీనియర్ నటుడు ఆత్మహత్య

బాలీవుడ్ సీనియర్ నటుడు ఆత్మహత్య
X

బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు ఆసిఫ్ బాస్రా 53 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ధర్మశాల మండలం మక్లీడ్ గంజ్ లోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఉరివేసుకొని మరణించినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఆయన మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు చేస్తోంది. కాగా 1967 లో మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించిన ఆసిఫ్ బాస్రా సినిమాల్లో నటించాలన్న కోరికతో 1989లో ముంబై వచ్చారు. కై పో చే, జబ్ వి మెట్, హిచ్కి, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, క్రిష్ 3, ఏక్ విలన్ తోపాటు అనేక సినిమాల్లో ఆసిఫ్ బాస్రా నటించారు.

Next Story

RELATED STORIES