సినిమా

Shilpa Shirodkar : నమ్రత సోదరికి కరోనా.. షాక్‌‌లో ఉపాసన...!

Shilpa Shirodkar : మళ్లీ కరోనా పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు కుడా కరోనా బారిన పడుతున్నారు

Shilpa Shirodkar : నమ్రత సోదరికి కరోనా.. షాక్‌‌లో ఉపాసన...!
X

Shilpa Shirodkar : మళ్లీ కరోనా పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు కుడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గత నాలుగురోజుల నుంచి కరోనాతో పోరాటం చేస్తున్నట్లుగా ఆమె వెల్లడించారు.

'ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి, దయచేసి టీకాలు వేసుకోని, అన్ని నియమాలను పాటించండి' అంటూ పోస్ట్ చేసింది. దీనిపైన నమ్రత స్పందిస్తూ.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని కామెంట్ చేసింది. శిల్పాకి కరోనా సోకడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఆమె కరోనాకి గురవ్వడానికి ముందు తన సోదరి నమ్రత, రామ్ చరణ్ భార్య ఉపాసన మరికొంతమందితో కలిసి దుబాయ్‌‌కి వెళ్లారు. అక్కడ క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు.

ఈ క్రమంలో శిల్పాకి కరోనా నిర్ధారణ అయింది. దీనితో నమ్రతా, ఉపాసన స్వచ్ఛందంగా క్వారంటైన్ కి వెళ్లినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే వీరు కూడా కరోనా పరీక్షలు చేయించుకోనున్నారు.

Next Story

RELATED STORIES