Krishnaveni : నా భర్తని పీక పిసికి ఊపిరాడకుండా చేసి చంపేశారు : కృష్ణవేణి

Krishnaveni :  నా భర్తని  పీక పిసికి ఊపిరాడకుండా చేసి చంపేశారు : కృష్ణవేణి
Krishnaveni : కృష్ణవేణి.. తెలుగు సినీ ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు.. నగ్న సత్యం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది కృష్ణవేణి.

Krishnaveni : కృష్ణవేణి.. తెలుగు సినీ ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు.. నగ్న సత్యం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది కృష్ణవేణి.. కృష్ణ హీరోగా వచ్చిన వారాలబ్బాయి సినిమాతో ఆమెకి మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత దాదాపుగా 200కు పైగా సినిమాల్లో నటించిన ఆమె తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదురుకుందట.. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

కృష్ణవేణి వారాలబ్బాయి సినిమా దర్శకుడు రాజచంద్రను పెళ్లి చేసుకున్నారు.. అయితే అంతకుముందే రాజచంద్రకి పెళ్లై ముగ్గురు పిల్లలున్నారు. రాజచంద్ర ఏమీ లేనివాళ్ళు అని చెప్పుకొచ్చారు కృష్ణవేణి. చాలా కష్టాలు పడ్డారని తెలిపారు. జీవనపోరాటం సినిమా తర్వాత ఒక్కో సినిమాకి మూడు లక్షల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే సమయానికి రాజచంద్ర చనిపోయాడని చెప్పుకొచ్చారు.

ఆయన్ని పెళ్లి చేసుకున్నాక నాలుగేళ్ళు మాత్రమే కలిసి ఉన్నామని చెప్పింది కృష్ణవేణి. వాస్తవానికి తనకి నలుపంటేనే నచ్చదని, టీ నల్లగా ఉంటేనే తాగనని, అలాంటిదాన్ని అనుకోని పరిస్థితుల వల్ల నల్లగా ఉండే రాజచంద్రని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. మీలాంటోళ్లు హెల్ప్‌గా ఉంటే తానేక్కడో ఉండేవాడిని అని రాజచంద్ర తరచూ అంటుండేవాడని తెలిపింది. ఇక ఆయన చనిపోయాకే ప్రపంచం తెలిసిందని, అప్పటివరకు తానో పిచ్చిదాన్ని వెల్లడించింది.

ఆయన చేసిన అన్ని సినిమాలు వందరోజులు ఆడాయని తెలిపింది. అయితే ఇదంతా చూసి ఓర్వలేక ఇండస్ట్రీవాళ్లే ఆయనను హత్య చేశారని వెల్లడించింది కృష్ణవేణి.. కరెంట్‌ వైర్లతో కాల్చి, పీక పిసికి ఊపిరాడకుండా చేసి చంపేశారని చెప్పుకొచ్చింది. పోలీసువాళ్లు కూడా ఎవరు చేయించారో మాకు తెలుసు, కానీ మేం ఏం చేయలేం అని చేతులెత్తేశారని పేర్కొంది. అయితే ఆయనని హత్య చేయించినవారు కూడా చనిపోయారని తెలిపింది కృష్ణవేణి.

Tags

Read MoreRead Less
Next Story