సినిమా

HBD Nayanthara : నయన్ బర్త్‌‌డే.. స్పెషల్ గెస్ట్‌‌‌గా సామ్...!

HBD Nayanthara : నయనతార, విఘ్నేష్ శివన్.... వీరిద్దరిలో ఎవరి బర్త్‌‌డే అయిన ఆ సెలబ్రేషన్స్ ఇంకో లెవల్‌‌లో ఉంటుంది.

HBD Nayanthara :  నయన్ బర్త్‌‌డే.. స్పెషల్ గెస్ట్‌‌‌గా సామ్...!
X

HBD Nayantara : నయనతార, విఘ్నేష్ శివన్.... వీరిద్దరిలో ఎవరి బర్త్‌‌డే అయిన ఆ సెలబ్రేషన్స్ ఇంకో లెవల్‌‌లో ఉంటుంది. ఈసారి ఆమె 39వ బర్త్‌‌డేను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు విఘ్నేష్... సరిగ్గా 12 గంటలకి ఆమె బర్త్‌‌డే కోసం పెద్ద పార్టీ ఎరేంజ్ చేశాడు. దీనికి కొంతమందిని మాత్రమే ఇన్వైట్ చేశాడు.. అందులో సమంత ఒకరు. నయన్ అంటూ ఇంగ్లిష్ అక్షరాలతో తయారుచేసిన పెద్ద కేక్‌‌ను తన ప్రేయసి కోసం ఆర్డర్ చేశాడు. అంతేకాకుండా టపాసులు కూడా పేల్చి నయన్‌‌కి ఊహించని సప్రైజ్ ఇచ్చాడు. సప్రైజ్ కి ఎంతో పులకించిపోయిన ఆమె.. కేక్ కట్ చేసే ముందు విఘ్నేష్‌‌ను గట్టిగా హాగ్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలావుండగా నయన్-విఘ్నేష్ గత ఆరేళ్ళుగా రిలేషన్‌‌‌షిప్‌‌లో ఉన్నారు. తాజాగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇక ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాలి మరి.Next Story

RELATED STORIES