సినిమా

Sneha : ఇద్దరు వ్యాపారవేత్తల పై కేసు పెట్టిన సినీ నటి స్నేహ!

Sneha : సినీ నటి స్నేహ పోలీసులను ఆశ్రయించారు.. చెన్నైలోని కానత్తూర్ పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఓ ఇద్దరు వ్యాపారవేత్తల పైన ఆమె కేసు నమోదు చేశారు.

Sneha : ఇద్దరు వ్యాపారవేత్తల పై కేసు పెట్టిన సినీ నటి స్నేహ!
X

Sneha : సినీ నటి స్నేహ పోలీసులను ఆశ్రయించారు.. చెన్నైలోని కానత్తూర్ పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఓ ఇద్దరు వ్యాపారవేత్తల పైన ఆమె కేసు నమోదు చేశారు. సదరు వ్యాపారవేత్తలు తమ బిజినెస్‌ కోసం తన దగ్గర రూ. 26 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇప్పుడు దానికి వడ్డీ చెల్లించమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. వడ్డీ పక్కన పెడితే తీసుకున్న డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా తనకి రిటర్న్స్ రూపంలో చెల్లించలేదని ఆమె పేర్కొంది. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఇక తొలివలపు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాలలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఆ తర్వాత తన చిరకాల స్నేహితులు, నటుడు ప్రసన్నను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Next Story

RELATED STORIES