సినిమా

chiranjeevi_vijayashanti : చిరంజీవితో ఢీ అంటే ఢీ అన్న విజయశాంతి .. ఇద్దరికి ఒకే సినిమాతో బీభత్సమైన క్రేజ్..!

chiranjeevi_vijayashanti : నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో మూడు తరాల హీరోయిన్ లతో కలిసి నటించారు మెగాస్టార్ చిరంజీవి.

chiranjeevi_vijayashanti : చిరంజీవితో ఢీ అంటే ఢీ అన్న విజయశాంతి .. ఇద్దరికి ఒకే సినిమాతో బీభత్సమైన క్రేజ్..!
X

chiranjeevi_vijayashanti : నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో మూడు తరాల హీరోయిన్ లతో కలిసి నటించారు మెగాస్టార్ చిరంజీవి.. చేసిన 151సినిమాలలో దాదాపుగా అరవై మంది హీరోయిన్ లతో కలిసి నటించారాయన.. ఇందులో చిరంజీవితో హిట్ పెయిర్ అనిపించుకున్నది కొందరు హీరోయిన్లు మాత్రమే. అందులో విజయశాంతి ఒకరు.

సిల్వర్ స్క్రీన్ పైన చిరంజీవి, విజయశాంతిలది సూపర్ హిట్ కాంబినేషన్. మొత్తం వీరి కాంబినేషన్ లో ఏకంగా పంతొమ్మిది చిత్రాలు వచ్చాయి. వీరి కలయికలో వచ్చిన మొదటి చిత్రం సంఘర్షణ కాగా చివరి చిత్రం మెకానిక్ అల్లుడు.. ఇందులో చాలెంజ్, కొండవీటి రాజా, పసివాడి ప్రాణం, స్వయంకృషి, యముడికి మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలున్నాయి. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

చిరంజీవి అంటేనే డాన్స్ కి పెట్టింది పేరు.. ఆయనతో డాన్స్ అంటేనే హీరోయిన్స్ కి పెద్ద సవాలే.. అలా చిరంజీవి పక్కన సరిసమానంగా డాన్స్ చేసే హీరోయిన్ గా అప్పట్లో రాధకి మాత్రమే పేరుండేది. కానీ గ్యాంగ్ లీడర్ చిత్రంతో ఆ లిస్టులో విజయశాంతి కూడా చేరిపోయారు. డ్యాన్సులో చిరంజీవితో ఢీ అంటే ఢీ అన్నారు విజయశాంతి. ఒక్క టైటిల్‌ సాంగ్‌ మినహా మిగతా 5 పాటలూ హీరో, హీరోయిన్‌ మధ్యే ఉంటాయి.

ఇందులో చిరుతో సరిసమానంగా స్టెప్స్ వేసి అదరగొట్టారు విజయశాంతి. ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో అటు చిరంజీవికి ఇటు విజయశాంతికి అభిమానుల్లో బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా చిరంజీవికి మాస్ ఇమేజ్ ని పటిష్టం కావడానికి ఈ చిత్రం విజయం చాలా దోహదం చేసిందని చెప్పాలి.

Next Story

RELATED STORIES