సినిమా

Addanki Dayakar : అద్దంకి దయాకర్‌ హీరోగా సినిమా.. హీరోయిన్ ఎవరంటే?

Addanki Dayakar : తెలంగాణ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌.. సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. దయాకర్‌ హీరోగా బొమ్మక్‌ క్రియేషన్‌ ఓ సినిమాను నిర్మిస్తోంది.

Addanki Dayakar : అద్దంకి దయాకర్‌ హీరోగా సినిమా.. హీరోయిన్ ఎవరంటే?
X

Addanki Dayakar : తెలంగాణ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌.. సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. దయాకర్‌ హీరోగా బొమ్మక్‌ క్రియేషన్‌ ఓ సినిమాను నిర్మిస్తోంది. రాజకీయాలు, కొవిడ్, చైనా బయోవార్ ప్రధాన అంశాలుగా నిర్మిస్తున్న ఈ మూవీలో దయాకర్‌తో పాటు హీరో సుమన్, గద్దర్, ఇంద్రజ, శుభలేఖ సుధాకర్, దాసొజు శ్రావణ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రజా యుద్ద నౌక గద్దర్ పాడిన పాటకు కీరవాణి సంగీతం అందించారు. బొమ్మక్ మురళి నిర్మాణ, దర్శకత్వంలో మూవీ రూపొందుతోంది. తన నిజజీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా సెమీ బయోపిక్‌గా సినిమా తీస్తున్నట్లు అద్దంకి దయాకర్‌ తెలిపారు. 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 2వ వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా కోసం 2నెలలు శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు అద్దంకి దయాకర్

Next Story

RELATED STORIES