హనుమంతుడు దేవుడే కాదు: ఆదిపురుష్ డైలాగ్ రైటర్

హనుమంతుడు దేవుడే కాదు: ఆదిపురుష్ డైలాగ్ రైటర్
మనోజ్ ముంతాషిర్ 'బజరంగ్ బలీ బగవాన్ నహీ హే' అంటూ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు

ఆదిపురుష్ సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. సినిమా విడుదలైనప్పటి నుంచి డైలాగ్ వర్షన్ పై, రావణుని కోటపై, VFXపై విమర్శకులు దాడి చేశారు. తాజాగా ఆదిపురుష్ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ హనుమంతుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంజనేయుడు దేవుడు కాదని అన్నాడు. అయితే తన అశేష రామ భక్తి కారణంగా హనుమ శక్తివంతమైన స్థితిని పొందాడని అందుకే ఆయన్ని ప్రజలు దేవుడిగా కొలుస్తున్నారని మనోజ్ అన్నారు. ఈ ప్రకటన సంచలనం అయింది.

ఇప్పటికే ఆదిపురుష్ లోని డైలాగ్స్ పై విమర్శలను ఎదుర్కొన్నాడు మనోజ్. పాత్రలు ఉపయోగించిన భాషపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డైలాగ్స్ ను మారుస్తున్నట్లు గతవారం ప్రకటించారు. ఆపై ఆయనకు చిత్ర యునిట్ అండగా నిలబడింది. తాజాగా హనుమ దేవుడే కాదని చెప్పడంతో సమస్య మరింత తీవ్రమైంది.

మనోజ్ ముంతాషిర్ 'బజరంగ్ బలీ బగవాన్ నహీ హే' అంటూ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. దీంతో పాటే ఆదిపురుష్ లోని డైలాగ్స్ ను సమర్థించే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలోనే ఆంజనేయస్వామి దేవుడు కాదని చెప్పాడు. అయితే రాముడి పట్ల ఉన్న ఆయన భక్తి శక్తిగా మారి దేవుడిగా పరిగనింపబడ్డాడని అన్నారు. డైలాగ్స్ ను సమర్థించే క్రమంలో... సినిమాలోని ప్రతీ పాత్రకు డైలాగ్స్ రాసే క్రమంలో విభిన్నత అవసరం అని భావించినట్లు చెప్పారు. అన్ని పాత్రలు ఒకేలా ప్రవర్తించవు, అందరూ ఒకే భాష మాట్లాడలేరు. కాబట్టి డాలగ్స్ లో వేరియేషన్స్ ఉన్నాయని తెలిపారు.

ఆదిపురుష్ డైలాగ్స్ పై విమర్శలు రావడంతో పాటు పలు సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మనోజ్ తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నాడు. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మనోజ్ కు రక్షణ కల్పించినట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story