సినిమా

Adivi Sesh: స్టైలిష్ పోలీస్‌గా అడవి శేష్.. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో..

Adivi Sesh: కరోనా ఫస్ట్ వేవ్ లాక్‌డౌన్ కంటే ముందు థియేటర్లలో విడుదలయ్యి సూపర్ హిట్ సాధించిన చిత్రం ‘హిట్’.

Adivi Sesh: స్టైలిష్ పోలీస్‌గా అడవి శేష్.. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో..
X

Adivi Sesh: కరోనా ఫస్ట్ వేవ్ లాక్‌డౌన్ కంటే ముందు థియేటర్లలో విడుదలయ్యి సూపర్ హిట్ సాధించిన చిత్రం 'హిట్'. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రూహానీ శర్మ హీరోయిన్‌గా కనిపించింది. ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించగా నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించారు. పర్ఫెక్ట్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ 'హిట్'కు ఇప్పుడు సీక్వెల్ సిద్ధమవుతోంది.

అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి టాలీవుడ్‌లోని మంచి థ్రిల్లర్స్‌లో ఒకటిగా పేరు తెచ్చుకుంది 'హిట్'. సోలో హీరోగా విశ్వక్ సేన్‌కు మంచి విజయాన్నే తెచ్చిపెట్టింది. అయితే పలు కారణాల వల్ల హిట్ సినిమా సీక్వెల్‌లో విశ్వక్ సేన్‌ను కాకుండా అడవి శేష్‌ను హీరోగా ఎంచుకున్నారు దర్శక నిర్మాతలు. థ్రిల్లర్స్‌కు మారు పేరైన అడవి శేష్ ఇందులో హీరో అనగానే ఈ సీక్వెల్ మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి.

డిసెంబర్ 17న అడవి శేష్ పుట్టినరోజు సందర్భంగా 'హిట్ 2' నుండి తన గ్లింప్స్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. ఇందులో కేడీ పాత్రలో స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు అడవి శేష్. ఇందులో తన యాక్టింగ్ కూడా ఎప్పటిలాగానే ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసేలా కనిపిస్తోంది. ఇక దీనితో పాటు 'మేజర్' సినిమాలో కూడా అడవి శేష్ హీరోగా కనిపిస్తున్నాడు.

Next Story

RELATED STORIES