Sonali Bindre : 18 ఏళ్ల తర్వాత సోనాలి బింద్రే రీఎంట్రీ..స్టార్ హీరో సినిమాతో..!

Sonali Bindre : 18 ఏళ్ల తర్వాత సోనాలి బింద్రే రీఎంట్రీ..స్టార్ హీరో సినిమాతో..!
Sonali Bindre : మురారి, ఖడ్గం, ఇంద్ర, మన్మధుడు, శంకర్‌‌దాదా ఎంబీబీఎస్ వంటి వరుస సక్సెస్ లతో టాలీవుడ్‌‌లో టాప్ హీరోయిన్‌‌గా ఎదిగింది సోనాలి బింద్రే..

Sonali Bindre : మురారి, ఖడ్గం, ఇంద్ర, మన్మధుడు, శంకర్‌‌దాదా ఎంబీబీఎస్ వంటి వరుస సక్సెస్ లతో టాలీవుడ్‌‌లో టాప్ హీరోయిన్‌‌గా ఎదిగింది సోనాలి బింద్రే.. కథలపై మంచి పట్టు ఉన్న సోనాలి.. తాను ఏ సినిమా చేసినా సరే అది బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుందనే సెంటిమెంట్ అప్పట్లో ఉండేది.. 2004లో చిరంజీవి హీరోగా వచ్చిన శంకర్ దాదా MBBS సినిమా తర్వాత సోనాలి బింద్రే మళ్లీ తెలుగులో నటించలేదు. కొన్నాళ్లు బాలీవుడ్ సినిమాల్లో నటించినా.. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది.. కొన్నాళ్లకి క్యాన్సర్‌తో బాధపడిన ఆమె న్యూయార్క్‌‌కి వెళ్లి అక్కడ ప్రత్యేక చికిత్స తీసుకొని కోలుకుంది.

క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత సోనాలి బింద్రే టెలివిజన్ షోలకే పరిమితమైంది. కొన్ని రియాల్టీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించింది.. అయితే సోనాలి బింద్రే 18 సంవత్సరాల తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌‌లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించనుందని తెలుస్తోంది. తాజాగా దర్శకుడు కొరటాల శివ సోనాలి బింద్రేని కలిసి కథ, ఆమె పాత్రను వివరించగా ఈ సినిమా చేయడానికి ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనిపైన త్వరలోనే అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story