సినిమా

ఇడ్లీలు అమ్ముకునే తెలుగు వ్యక్తికి తమిళ హీరో ఆర్థిక సాయం..

చేసిన సహాయానికి ప్రచారాన్ని ఇష్టపడని అజిత్.. అతడికి సహాయం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇడ్లీలు అమ్ముకునే తెలుగు వ్యక్తికి తమిళ హీరో ఆర్థిక సాయం..
X

సినిమాల్లో హీరోలు నిజ జీవితంలో కూడా హీరోలుగా గుర్తింపబడుతున్నారు. ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. కొండంత అండగా నిలుస్తున్నారు. తాజాగా తమిళ హీరో అజిత్ తన చిత్రం వాలిమై షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చాడు. అక్కడి పరిసరాల్లోని ఓ వ్యక్తిని రోజూ గమనించేవాడు. ఇడ్లీలు వేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ వ్యక్తిపై అజిత్ దృష్టి పడింది. షూటింగ్ సమయంలో అతడి వద్ద నుంచే ఇడ్లీలు తెప్పించుకుని తినేవాడు.

అతడి ఆర్థిక పరిస్థితిని గురించి ఆరా తీసిన అజిత్ కూతురిని చదివించడం కోసం కష్టపడుతున్నాడని తెలుసుకున్నాడు. తక్కువ రేటుకే రుచికరమైన ఇడ్లీలు అందిస్తున్న అతడికి వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకునందుకు సాయం చేయాలనుకున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోమంటూ అజిత్ అతడికి లక్షరూపాయలు అందించారు. చేసిన సహాయానికి ప్రచారాన్ని ఇష్టపడని అజిత్.. అతడికి సహాయం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కాగా వాలిమై చిత్రాన్ని దర్శకుడు వినోద్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో అజిత్ ఒక బైక్ రెజర్‌గా కనిపించనున్నారు. అజిత్‌కు బైక్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.

Next Story

RELATED STORIES