సినిమా

Akhanda Collection: 'అఖండ' బాక్సాఫీస్ కలెక్షన్స్ అదుర్స్..

Akhanda Collection: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అఖండ’ సినిమా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తోంది.

Akhanda Collection (tv5news.in)
X

Akhanda Collection (tv5news.in)

Akhanda Collection: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అఖండ' సినిమా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో బాలయ్య ఇతర సినిమాలతో పోలిస్తే అఖండ ముందంజలో ఉంది. వీకెండ్‌లో కూడా అదే స్పీడ్‌తో దూసుకుపోతోంది.

ఇండియాలోనే కాదు ఓవర్సీస్‌లో కూడా అఖండ జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా అమెరికాలో అఖండ కలెక్షన్లు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అమెరికాలో ఇప్పటికే 7 లక్షల డాలర్ల మార్కును టచ్ చేసింది అఖండ. అంతే కాకుండా వేగంగా 1 మిలియన్ వసూళ్ల వైపు పరుగులు పెడుతోంది. మూడు రోజుల్లోనే అఖండ రూ. 60 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

సింగిల్ స్క్రీన్స్‌లోనే కాదు.. మల్టీప్లెక్స్‌లో కూడా చాలాచోట్ల అఖండకు హౌస్‌ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. బోయపాటి మాస్ టేకింగ్, బాలకృష్ణ యాక్షన్, తమన్ మ్యూజిక్.. ఇలా అన్నీ కలిపి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని బాలయ్య అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.

Next Story

RELATED STORIES