సినిమా

Akhanda Collection: 'అఖండ' ఆల్ టైమ్ రికార్డ్.. నైజాంలో..

Akhanda Collection: బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ హిట్ కాదు సూపర్ హిట్ అని ఇప్పటికే నిరూపించుకున్నారు.

Akhanda Collection (tv5news.in)
X

Akhanda Collection (tv5news.in)

Akhanda Collection: బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ హిట్ కాదు సూపర్ హిట్ అని ఇప్పటికే నిరూపించుకున్నారు. కానీ ఈ కాంబినేషన్ రికార్డులను తిరగరాసేదని 'అఖండ' సినిమాతో తెలిసేలా చేస్తున్నారు. ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో ఇప్పటికే అందరినీ ఆశ్చర్యపరిచింది అఖండ. విడుదలయ్యి ఒక నెల పూర్తయ్యే సమయానికి మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది.

నైజాంలో బాలయ్య సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అందుకే అక్కడ ఆయన సినిమాలకు మినిమమ్ హిట్ గ్యారెంటీ. కానీ బాలయ్య కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా అఖండ.. కేవలం నైజాంలోనే రూ. 20 కోట్లను కలెక్ట్ చేసింది. ఇన్నేళ్ల బాలకృష్ణ కెరీర్‌లో కేవలం నైజాంలోనే ఇంత షేర్ రావడం ఇదే మొదటిసారి. నైజాంలోనే కాదు ఓవరాల్ కలెక్షన్స్ విషయంలో కూడా అఖండ రికార్డులను సాధించింది.

నెల రోజుల క్రితం విడుదలయిన అఖండ 100 కోట్ల క్లబ్‌లో చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అఖండకు రూ. 101 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికీ ఎన్ని కొత్త సినిమాలు విడుదలయినా.. అఖండ కోసం థియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గకపోవడమే దీనికి కారణం. అంతే కాకుండా న్యూ ఇయర్ సందర్భంగా కూడా అఖండ సినిమాను చాలామందే చూసినట్టు సమాచారం

Next Story

RELATED STORIES