సినిమా

Akhanda : అఖండలో చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

Akhanda : ఇదిలావుండగా ఈ సినిమాలో ఓ కీ రోల్ ప్లే చేసింది నటి నవీనారెడ్డి.. కనిపించింది కొద్దిసేపే అయిన ప్రేక్షకులకి రిజిస్టర్ అయ్యే పాత్ర అమెది..

Akhanda :  అఖండలో చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
X

Akhanda : బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటివరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో ముచ్చటగా, మూడో సినిమాగా అఖండ తెరకెక్కి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మురళీ కృష్ణ, అఖండ రెండు పాత్రలో బాలకృష్ణ నటించి మెప్పించారు. బోయపాటి కూడా తనదైన మార్క్ తో సినిమాని తెరకెక్కించి నందమూరి అభిమనులకి బిగ్ ట్రీట్ ఇచ్చారు.

ఇదిలావుండగా ఈ సినిమాలో ఓ కీ రోల్ ప్లే చేసింది నటి నవీనారెడ్డి.. కనిపించింది కొద్దిసేపే అయిన ప్రేక్షకులకి రిజిస్టర్ అయ్యే పాత్ర అమెది.. అయితే ఆమెకి ఇదే మొదటి సినిమా కాదు. ఎఫ్2 సినిమాలో ఓ చిన్న రోల్ చేసింది. ఇదే ఆమెకి మొదటిచిత్రం. ఆ తర్వాత వెంకీమామ, భీష్మ,అద్భుతం, హిట్ మొదలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక దేవయాని,అర్ధశతాబ్దపు సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాలు ఆమెకి నటిగా ఐడెంటిటీని ఇవ్వలేకపోయాయి. కానీ అఖండలో చేసిన రోల్ ఆమెకి మంచి గుర్తింపుని ఇచ్చింది. ఇక నవీనారెడ్డి పక్కా హైదరాబాదు.. ఆమెకి ఓ చెల్లెలు ఉంది. ఇక నవీనా మెగాస్టార్ చిరంజీవికి పెద్ద అభిమాని.. చిరంజీవికి కరోనా సోకినప్పుడు ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేసింది. ఇండస్ట్రీలో ఉన్నంతవరకు సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక నవీనారెడ్డి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ ఉంటుంది.

Next Story

RELATED STORIES