సినిమా

Akhanda Movie: 'అఖండ'తో పోటీపడనున్న పాన్ ఇండియా సినిమా.. వీరిలో గెలుపెవరిది?

Akhanda Movie: బాలకృష్ణ, బోయపాటి శ్రీను.. టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న చాలా కాంబినేషన్స్‌లో ఇది కూడా ఒకటి

Akhanda Movie: అఖండతో పోటీపడనున్న పాన్ ఇండియా సినిమా.. వీరిలో గెలుపెవరిది?
X

Akhanda Movie: బాలకృష్ణ, బోయపాటి శ్రీను.. టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న చాలా కాంబినేషన్స్‌లో ఇది కూడా ఒకటి. వీరి సినిమా వస్తుందంటే దానిపై అంచనాలు కూడా ఆ రేంజ్‌లోనే ఉంటాయి. చాలారోజుల గ్యాప్ తర్వాత బాలయ్యలో ఆయన అభిమానులు చూడాలనుకుంటున్న యాంగిల్‌ను 'సింహా'తో చూపించారు బోయపాటి. ఆ తర్వాత 'లెజెండ్'తో మరో హిట్‌ను కొట్టారు. ఇప్పుడు 'అఖండ'తో హ్యాట్రిక్ హిట్‌కు సిద్ధమవుతున్నారు.

బోయపాటితో బాలయ్య సినిమా అనగానే మామూలుగా ప్రేక్షకులు అందులో మాస్ ఫైట్స్, డైలాగ్స్ ఉంటాయని ఆశిస్తారు. కానీ అఖండలో వాటితో పాటు మరింత వెరైటీ కంటెంట్‌ను కూడా యాడ్ చేశారు బోయపాటి. బాలకృష్ణను ఇంతకు ముందెన్నడూ చూడని రూపంలో, అఘోరగా చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఇది ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచేస్తోంది.

ఎంతో ఆలోచించిన తర్వాత అఖండ మూవీ టీమ్ ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే అదే వారం మరికొన్ని సినిమా అఖండతో పోటీకి దిగడానికి సిద్ధమయ్యాయి. అందులో ఒకటి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. అదే 'మరక్కార్‌: అరేబియా సముద్ర సింహం'. ఇది ఒరిజినల్‌గా మలయాళంలో తెరకెక్కిన 'మరక్కర్ అరబిక్కడలింటే సింహం' సినిమాకు తెలుగు డబ్బింగ్ వర్షన్.

మలయాళంలో తక్కువ బడ్జెట్‌తో వచ్చి ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాల సంఖ్యే ఎక్కువ. కానీ మొదటిసారి దర్శకుడు ప్రియదర్శన్ 100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. అంతే కాక సినిమాకు హైప్ కోసం సీనియర్ నటీనటులను కూడా కాస్ట్ చేశారు. మోహన్‌లాల్, కీర్తి సురేశ్, సునీల్‌శెట్టి, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్‌ ఇందులో లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే అఖండ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా ఇది కచ్చితంగా హిట్ అవుతుందన్న బలమైన నమ్మకంతో ఉంది మూవీ యూనిట్. అలాంటి అఖండకు మరక్కార్‌ చిత్రం ఎదురెళుతోంది. డిసెంబర్ 4న 'స్కైలాబ్' కూడా వీటితో పోటీకి దిగుతోంది. నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామక‌ృష్ణ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమా నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. మరి వీటిలో బాక్సాఫీస్ విన్నర్‌గా ఎవరు నిలుస్తారో..

Next Story

RELATED STORIES