సినిమా

Akhanda Remake : బాలీవుడ్ లోకి అఖండ.. అఘోరాగా స్టార్ హీరో?

Akhanda Remake : నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌‌‌లో వచ్చిన తాజా చిత్రం అఖండ.. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్ళతో దూసుకుపోతోంది.

Akhanda Remake : బాలీవుడ్ లోకి అఖండ.. అఘోరాగా స్టార్ హీరో?
X

Akhanda Remake : నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌‌‌లో వచ్చిన తాజా చిత్రం అఖండ.. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్ళతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి ఆట నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది ఈ చిత్రం.. ఇప్పటికే 2021లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా అఖండ చరిత్ర సృష్టించింది.

ఇక బాల‌కృష్ణ కెరీర్ లోనే హ‌య్యస్ట్ గ్రాస‌ర్ గా నిలిచే దిశ‌గా పయనిస్తోంది. ఈ సినిమాలో రైతుగా, అఘోరాగా రెండు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు బాలయ్య. ముఖ్యంగా టైటిల్ రోల్ అఖండలో విశ్వరూపం చూపించారు. ఇదిలావుండగా ఈ సినిమా పైన ఇప్పుడు బాలీవుడ్ కన్నుపడింది. ఈ సినిమాని అక్కడ రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అందులో భాగంగానే ప్రముఖ బాలీవుడ్ ద‌ర్శక‌నిర్మాత సాజిద్ న‌డియాడ్ వాలా హిందీలో రీమేక్ చేయ‌డానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అన్ని పక్కగా కుదిరితే అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగన్ అఖండ హిందీ రీమేక్ లో నటించే ఛాన్స్ ఉంది.

Next Story

RELATED STORIES