సినిమా

Akkineni Nagarjuna : పునీత్‌ కుటుంబాన్ని పరామర్శించిన హీరో నాగార్జున..!

Akkineni Nagarjuna : కన్నడ పవర్‌‌స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌‌కుమార్ అకాల మరణాన్ని ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

Akkineni Nagarjuna : పునీత్‌ కుటుంబాన్ని పరామర్శించిన హీరో నాగార్జున..!
X

Akkineni Nagarjuna : కన్నడ పవర్‌‌స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌‌కుమార్ అకాల మరణాన్ని ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఇక లేరనే వార్త యావత్ భారతీయ సినీ ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించింది. కంఠీరవ స్టేడీయంలో ఆదివారం పునీత్‌ అంత్యక్రియలు ముగిశాయి. ఆయనని చివరిసారి చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు కూడా తరలివెళ్ళారు. కాగా ఆయన సోషల్‌ మీడియాలో పునీత్‌ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఈ రోజు బెంగుళూరు వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్‌ ఇంటికి వెళ్లిన ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం పునీత్ రాజ్‌‌కుమార్ సోదరుడు హీరో శివరాజ్‌కుమార్‌తో పాటు ఆయన భార్య, పిల్లలను పరామర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Next Story

RELATED STORIES