సినిమా

Bangarraju Trailer : 'బంగార్రాజు' ట్రైలర్ వచ్చేసింది..!

Bangarraju Trailer : అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బంగార్రాజు’.

Bangarraju Trailer : బంగార్రాజు ట్రైలర్ వచ్చేసింది..!
X

Bangarraju Trailer : అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'బంగార్రాజు'. కృతిశెట్టి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకి కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియో, జీ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయనున్నారు.. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

తండ్రీకొడుకులిద్దరూ మరోసారి ఒకే ఫ్రేమ్‌లో చూసి అక్కినేని అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇద్దరి హీరోల యాస, మ్యానరిజం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే సన్నివేశాలు, ఉర్రూతలూగించే పాటల క్లిప్‌లతో ఈ ట్రైలర్‌ పండగ శోభను ముందుగానే తీసుకొచ్చిందనిపిస్తుంది. అనుబ్ రూబెన్స్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా పైన భారీ అంచనాలున్నాయి.

Next Story

RELATED STORIES