సినిమా

అక్కినేని వారింట పెళ్లి సందడి.. వెడ్డింగ్ కార్డ్ వైరల్..

ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్ధల కారణంగా వారి వివాహ బంధానికి స్వస్తి పలికారు.

అక్కినేని వారింట పెళ్లి సందడి.. వెడ్డింగ్ కార్డ్ వైరల్..
X

అక్కినేని మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుమంత్ పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ మధ్య నటనకు దూరమైనా మళ్లీ రావా సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. తాజాగా సుమంత్‌కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని నిజం చేస్తూ సుమంత్ వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ వైరల్ అయింది.అక్కినేని కుటుంబానికి సన్నిహితంగా ఉన్న పవిత్ర అనే అమ్మాయితో జీవితాన్ని పంచుకోనున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ సినిమా తొలిప్రేమలో హీరోయిన్‌గా నటించిన కీర్తి రెడ్డిని సుమంత్ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్ధల కారణంగా వారి వివాహ బంధానికి స్వస్తి పలికారు. సుమంత్, పవిత్రల వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్‌లో ఎస్పీ అనే అక్షరాలు హైలెట్ అయి ఆకట్టుకుంటోంది.

Next Story

RELATED STORIES