Allu Arjun creates history; హిస్టరీ క్రియేట్ చేసిన అల్లు అర్జున్.. ఫస్ట్ తెలుగు యాక్టర్ గా రికార్డ్

Allu Arjun creates history; హిస్టరీ క్రియేట్ చేసిన అల్లు అర్జున్.. ఫస్ట్ తెలుగు యాక్టర్ గా రికార్డ్
జాతీయ స్థాయిలో తెలుగు హీరో సత్తా.. ఐకానిక్ స్టార్ మరో విజయం

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ సారి తెలుగు వారికి గర్వకారణంగా అవార్డుల వెల్లువ మొదలైంది. పుష్ప రాజ్‌గా తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్‌బస్టర్ చిత్రం 'పుష్ప: ది రైజ్‌'కి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. 68 ఏళ్లలో తెలుగు నుంచి ఉత్తమ నటుడిగా గెలుపొందిన తొలి తెలుగు నటుడిగా రికార్డు సృష్టించారు. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ అవార్డులు అందుకున్నారు.

అల్లు అర్జున్ పుష్ప రాజ్‌గా తన నటనతో ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకున్నాడు. బన్నీ ఈ పాత్ర కోసం భారీ ఎత్తున ట్రాన్స్ఫర్మేషన్ చెందాడు. పుష్ప రాజ్ క్యారెక్టర్ లో అతని స్లాంగ్, నడవడం, నటించడం, శ్వాస తీసుకోవడం వంటి ప్రతిదాన్ని అవలీలగా ప్రతిబింబించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అల్లు అర్జున్ నటన, అతని బాడీ లాంగ్వేజ్, 'తగ్గెడే లే' అనే డైలాగ్.. బన్నీని మరింత అభిమానించేలా చేసింది.

ఉత్తమ నటుడి కేటగిరీలో ఇతర నామినేట్ చేయబడిన స్టార్‌లు RRR కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, జై భీమ్ కోసం సూర్య, కర్ణన్ కోసం ధనుష్, మానాడు కోసం సిలంబరసన్ TR, సర్పట్ట కోసం ఆర్య, నాయట్టు కోసం నటుడు జోజు జార్జ్ ఉన్నారు. అలియా భట్, కంగనా రనౌత్, లిజో మోల్, రేవతి ఉత్తమ నటి స్థానం కోసం పోరాడారు.

'పుష్ప' ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో పుష్ప అనే కూలీ ఎలా ఎదిగాడు.. తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడో ఇందులో అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటించగా... విలన్ క్యారెక్టర్ ఫహద్ ఫాసిల్ మరింత హుందాగా నటించారు. ఇక సమంతా రూత్ ప్రభు స్పెషల్ ఐటెం సాంగ్ ఊ అంటావా.. ఏ రేంజ్ లో క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. అంతేకాదు ఇది చార్ట్‌బస్టర్ హిట్ అయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story