సినిమా

Allu Arjun: పది సంవత్సరాల తర్వాత మరోసారి.. వందకు పైగా డ్యాన్సర్లతో గ్రాండ్ వెల్‌కమ్..

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ మధ్య ఎవరు సపోర్ట్ కోసం వచ్చినా కాదని ఇచ్చేస్తున్నారు.

Allu Arjun (tv5news.in)
X

Allu Arjun (tv5news.in)

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ మధ్య ఎవరు సపోర్ట్ కోసం వచ్చినా కాదని ఇచ్చేస్తున్నారు. ఎక్కడికి రమ్మని ఇన్విటేషన్ వచ్చినా కాదనకుండా వెళ్లిపోతున్నారు. ఇది ఆయన సినిమా 'పుష్ప'కు కూడా పెద్ద ప్లస్‌గానే మారుతోంది. అల్లు అర్జున్ ఏ ఈవెంట్‌కు వెళ్లినా.. అభిమానులు పుష్ప సినిమా గురించి అడగడం వల్ల ఆ మూవీకి ఫ్రీ ప్రమోషన్ లభించేస్తోంది. తాజాగా అల్లు అర్జున్ మరో ఈవెంట్‌కు వెళ్లగా అక్కడ పుష్ప పాటతోనే ఆయనకు గ్రాండ్ ఎంట్రీ లభించింది.

పుష్ప సినిమాలో ఇప్పటివరకు నాలుగు పాటలు విడుదలయ్యాయి. వాటిలో ఇటీవల విడుదలయిన ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా పాట చాలా క్యాచీగా ఉండడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పాట మీద రీల్స్, కవర్ సాంగ్స్ కూడా మొదలయిపోయాయి. అందుకే ఇటీవల ఢీ ఫైనల్స్‌కు స్పెషల్ గెస్ట్‌గా వెళ్లినప్పుడు కూడా అక్కడ బన్నీకి డ్యాన్సర్స్ ఇదే పాటతో వెల్‌కమ్ చెప్పారు.

ఢీకి బన్నీ స్పెషల్ గెస్ట్‌గా రావడం ఇది మొదటిసారి కాదు. ఢీ3 కి కూడా అల్లు అర్జునే ఛీఫ్ గెస్ట్. అప్పుడు అల్లు అర్జున్.. ఆర్య 2 షూటింగ్‌లో ఉన్నాడు. అందుకే అల్లు అర్జున్, సుకుమార్ కలిసి ఢీ3 ఫైనల్స్‌కు ఛీఫ్ గెస్ట్‌లుగా హాజరయ్యారు. పదేళ్ల తర్వాత అదే సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తూ.. మళ్లీ అదే ప్రోగ్రాం‌కు ఛీఫ్ గెస్ట్‌గా రావడం విశేషం. ఇటీవల ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమో కూడా విడుదలయ్యింది.

Next Story

RELATED STORIES