సినిమా

Allu Arjun: అల్లు అర్జున్‌కు స్పెషల్ విషెస్.. ఆనందంగా ఫోటోను షేర్ చేసిన బన్నీ..

Allu Arjun: ఈరోజు (డిసెంబర్ 17న) దేశవ్యాప్తంగా ‘పుష్ప’ సందడి మొదలయ్యింది.

Allu Arjun: అల్లు అర్జున్‌కు స్పెషల్ విషెస్.. ఆనందంగా ఫోటోను షేర్ చేసిన బన్నీ..
X

Allu Arjun: ఈరోజు (డిసెంబర్ 17న) దేశవ్యాప్తంగా 'పుష్ప' సందడి మొదలయ్యింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా కావడంతో పుష్పపై ముందు నుండే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగినట్టు పుష్ప కూడా బాగానే ఓపెనింగ్స్‌ను సంపాదించింది. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షోగా పుష్ప పాజిటివ్ టాక్ అందుకుంటోంది.

పుష్ప భారీ స్థాయిలో విడుదల అవుతుండడంతో చాలాచోట్ల అభిమానులకు టికెట్లు దొరకడం కూడా కష్టమయ్యింది. మరికొన్ని చోట్ల పుష్ప ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవాలని థియేటర్ల యాజమాన్యం విపరీతంగా టికెట్ ధరలను పెంచేసింది. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పుష్ప టీమ్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. అయితే ఈ అన్నింటి విషెస్ మధ్యలో బన్నీకి ఓ స్పెషల్ విష్ అందింది.

అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ కూడా పుష్ప సినిమా హిట్ అవ్వాలని ప్రత్యేకంగా విషెస్ తెలిపాడు. తన హ్యాండ్ రైటింగ్‌తో 'ఆల్ ది బెస్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్' అని తన తండ్రికి ఓ లెటర్ రాశాడు. అంతే కాక పుష్ప అంటూ ఓ బొమ్మ కూడా గీశాడు. ఈ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన అల్లు అర్జున్ 'యూ మేడ్ మై డే' అని క్యాప్షన్ పెట్టాడు.


Next Story

RELATED STORIES