సినిమా

Pushpa Pre Release Event: ప్రీ రిలీజ్‌లో ఆమెకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకున్న అల్లు అర్జున్..

Pushpa Pre Release Event: పాన్ ఇండియా సినిమా పుష్ప రిలీజ్‌కు ఇంకా వారం రోజులే సమయం ఉంది.

Pushpa Pre Release Event: ప్రీ రిలీజ్‌లో ఆమెకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకున్న అల్లు అర్జున్..
X

Pushpa Pre Release Event: పాన్ ఇండియా సినిమా పుష్ప రిలీజ్‌కు ఇంకా వారం రోజులే సమయం ఉంది. దీంతో ఎక్కడ చూసినా ఈ సినిమా విశేషాలే వినిపిస్తు్న్నాయి. ప్రేక్షకుల అంచనాలు మరింత పెంచడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్‌లోని హిట్ డైరెక్టర్లు చాలామంది హాజరయ్యాయి. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఒకరికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు.

పుష్ప సినిమా అంతా ఒక ఎత్తు అయితే.. అందులో సమంత చేసిన స్పెషల్ సాంగ్ మరో ఎత్తుగా నిలుస్తోంది. ఒక్క పాటతో పుష్ప సినిమా ప్రేక్షకులు అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంది. కేవలం లిరికల్ వీడియోకే అతి తక్కువ సమయంలో 14 మిలియన్ల వ్యూస్‌‌ను సాధించింది రికార్డ్ సృష్టించింది ఇందులో స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా'.

పుష్పలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుంది అనగానే ఆడియన్స్ అంతా ఆ పాటను ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూశారు. కేవలం అయిదు రోజుల్లోనే ఈ పాట షూటింగ్ పూర్తి చేసుకుని మరో రెండు రోజుల్లో లిరికల్ వీడియోను విడుదల చేయనున్నట్టుగా అప్డేట్ ఇచ్చేశారు. ఇక విడుదలయినప్పటి నుండి ఈ పాట రికార్డ్స్ బ్రేక్స్ చేయడమే పనిగా పెట్టుకుంది.

సమంత స్పెషల్ సాంగ్.. పుష్ప సినిమాకే హైలెట్ అవ్వడంతో అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సామ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మామూలుగా స్పెషల్ సాంగ్ అనగానే హీరోయిన్స్‌కు కొన్ని పరిమితులు ఉంటాయని, కానీ సమంత అలా కాదని అన్నారు. సమంత నమ్మినా నమ్మకపోయినా.. టీమ్ ఏం అడిగితే అది చేసి వెళ్లిపోయారని అన్నారు.

Next Story

RELATED STORIES