సినిమా

Pushpa Twitter Review : ఎక్కడా తగ్గలే.. బన్నీ వన్ మ్యాన్ షో.. 'పుష్ప' అదిరింది అంతే..!

Pushpa Twitter Review : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా పుష్ప సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే..

Pushpa Twitter Review : ఎక్కడా తగ్గలే.. బన్నీ వన్ మ్యాన్  షో.. పుష్ప అదిరింది అంతే..!
X

Pushpa Twitter Review : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా పుష్ప సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు (డిసెంబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్, ఓవర్సీస్ పబ్లిక్ తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు.

బన్నీ కెరీర్‌లోనే ఈ సినిమా ది బెస్ట్ ఫిలిం అవుతుందని అంటున్నారు. సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉందని, మ్యానరిజం పీక్స్‌లో ఉన్నాయని అంటున్నారు. ఎక్కడ కూడా పుష్పరాజ్ తగ్గలేదని, బన్నీ వన్ మాన్ షో అంటున్నారు. ఇంటర్వెల్ సీన్స్, అలాగే క్లైమాక్స్ సీన్స్ సినిమాకి మెయిన్ హైలెట్ అంటున్నారు.

సమంత స్పెషల్ సాంగ్ అదిరిపోయిందని, చివరి 20 నిమిషాల్లో ఫహద్ ఫాజిల్- అల్లు అర్జున్ నడుమ వచ్చే కొన్ని సీన్స్ ఫ్యాన్స్ కి మంచి కిక్కిస్తాయని అంటున్నారు. అలాగే, యాక్షన్ సీన్లు అదిరిపోయాయని అంటున్నారు. సినిమాలో మెయిన్ ట్విస్ట్ 'ఏ బిడ్డా ఇది నా అడ్డా' పాటలో ఉందట

Next Story

RELATED STORIES