సినిమా

Pushpa OTT Release: అది పుష్ప రేంజ్.. అమెజాన్‌ భారీ డీల్‌.. ఎంతంటే?

Pushpa OTT Release: రేపు(జనవరి 7) రాత్రి 8 గంటల నుంచి పుష్ప స్ట్రీమింగ్‌ కానుందని అమెజాన్‌ ప్రైమ్ అధికారిక ప్రకటన ఇచ్చింది.

Pushpa OTT Release: అది పుష్ప రేంజ్.. అమెజాన్‌ భారీ డీల్‌.. ఎంతంటే?
X

Pushpa OTT Release: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌‌‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రష్మిక మందన్న హీరోయిన్‌‌గా నటించింది. సినిమాకి ముందునుంచి మంచి టాక్ రావడంతో వసూళ్ళ పరంగా సినిమా అదరగొడుతోంది.

ఇక హిందీలో అయితే ఊహించని విధంగా కలెక్షన్లు రాబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పుష్ప రూ. 300కోట్ల ట్రేడ్‌ మార్క్‌ను దాటేసి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. ఇదిలావుండగా సంక్రాంతి సందర్భంగా ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాని రిలీజ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

రేపు(జనవరి 7) రాత్రి 8 గంటల నుంచి పుష్ప స్ట్రీమింగ్‌ కానుందని అమెజాన్‌ ప్రైమ్ అధికారిక ప్రకటన ఇచ్చింది. అయితే ఓటీటీ కోసం అమెజాన్‌ ప్రైం పుష్ప చిత్రాన్ని భారీ ఒప్పందానికి సొంతం చేసుకుందని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం ఏకంగా 22 కోట్లు చెల్లించినట్లుగా సమాచారం. కాగా అన్ని భాషల్లో ఒకేసారి ఓటీటీలోకి వస్తున్న 'పుష్ప'.. హిందీలో మాత్రం కాస్తా ఆలస్యంగా రానుందట.

Next Story

RELATED STORIES