Amitabh Bachchan: ఇల్లు అమ్ముకున్న అమితాబ్ బచ్చన్.. షాకిస్తున్న ధర..

Amitabh Bachchan: ఇల్లు అమ్ముకున్న అమితాబ్ బచ్చన్.. షాకిస్తున్న ధర..
Amitabh Bachchan: సౌత్ ఢిల్లీలో తన కుటుంబంతో ఉండడానికి సోపాన్‌ను కట్టుకున్నాడు అమితాబ్.

Amitabh Bachchan: సెలబ్రిటీలు సౌకర్యవంతమైన ఇళ్లల్లో ఉండడం తమ స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. అందుకే కోట్ల ఖర్చుతో ఇళ్లను కడతారు. అలాగే అమితాబ్ బచ్చన్ కూడా చాలాకాలం క్రితం తాను, తన కుటుంబంతో ఉండడానికి ఓ సౌకర్యవంతమైన ఇల్లును కట్టుకున్నాడు. దానికి 'సోపాన్‌' అని పేరు కూడా పెట్టుకున్నాడు. కానీ ప్రస్తుతం ఆ ఇల్లును అమ్మేశాడట బిగ్ బి. పైగా దాని ధర వింటున్న ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు.

సౌత్ ఢిల్లీలో తన కుటుంబంతో ఉండడానికి సోపాన్‌ను కట్టుకున్నాడు అమితాబ్. కానీ అనూహ్యంగా ఆ ఇంటిని ఇప్పుడు అమ్మేశాడు. దానిని కొనుగోలు చేసింది కూడా బచ్చన్ ఫ్యామిలీకి సన్నిహితులైన నెజోన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ అవని బడెర్. అయితే అది పాత కట్టడం కావడంతో.. అవని దానిని కూల్చేసి, కొత్తగా హంగులతో నిర్మాణం చేపట్టనున్నట్టుగా తెలిపారు.

అయితే సోపాన్ ధర విన్న ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఇంటిని అవని బడెర్ ఏకంగా రూ.23 కోట్లతో కొనుగోలు చేశారట. అంతే కాకుండా తాజాగా లోఖండ్‌వాలాలో ఉన్న తన డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కూడా నెలకు రూ.10 లక్షల రెంట్‌తో హీరోయిన్ కృతి సనన్‌కు ఇచ్చేశాడు అమితాబ్. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి జుహులో 'జల్సా' పేరుతో కట్టుకున్న ఇంట్లో నివాసముంటున్నారు. జుహులో అమితాబ్‌కు మరో ఇల్లు కూడా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story