Amma Rajasekhar : నితిన్‌కు డ్యాన్స్ నేనే నేర్పించా : అమ్మ రాజశేఖర్

Amma Rajasekhar : నితిన్‌కు డ్యాన్స్ నేనే నేర్పించా : అమ్మ రాజశేఖర్
Amma Rajasekhar : నితిన్‌కు డ్యాన్స్ రాదు.. నేేనే నేర్పించానన్ని అమ్మ రాజశేఖర్

Amma Rajasekhar : టాలీవుడ్ కొరియోగ్రాఫర్, డ్యాన్స్ మాస్టర్ అమ్మరాజశేఖర్ చేసిన తాజా కామెంట్స్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. " హీరో నితిన్‌కు డాన్స్ రాదు.. నేనే నేర్పించా, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తానని చెప్పి రాలేదు.. నన్ను ఇన్సల్ట్ చేశాడు‌" అంటూ అమ్మ రాజశేఖర్ అన్నారు. అమ్మరాజశేఖర్ స్వయంగా తన బ్యానర్‌లో నిర్మించి చిత్రం "హైఫైవ్".. త్వరలో ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అమ్మ రాజశేఖర్ ఈ సెన్షేశ్‌నల్ కామెంట్స్ చేశారు.

టక్కరి సినిమాకు హీరో నితిన్, అమ్మ రాజశేఖర్ కలిసి పనిచేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. టాప్ హీరోలకు అమ్మరాజశేఖర్ కొరియోగ్రాఫర్ డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారు. హీరో నితిన్.. "మాచర్ల నియోజకవర్గం" మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే నితిన్ బిజీగా లేకున్నా ఇంట్లో ఉండి కూడా రాలేదని అమ్మరాజశేఖర్ అనడంతో టాలీవుడ్‌లో ఈ కామెంట్స్ ప్రస్తుతం కాంట్రవర్సీ అయింది.

Tags

Read MoreRead Less
Next Story