Amrita Rao: ఆ సీన్స్ వల్లే భారీ ఆఫర్స్‌ను వదిలేసుకున్న మహేశ్ హీరోయిన్..

Amrita Rao: ఆ సీన్స్ వల్లే భారీ ఆఫర్స్‌ను వదిలేసుకున్న మహేశ్ హీరోయిన్..
Amrita Rao: వివాహ్ సినిమా తర్వాత అమృతాకు బాలీవుడ్‌లో చాలానే అవకాశాలు వచ్చాయి.

Amrita Rao: సినీ ఇండస్ట్రీ అంటే హీరోయిన్స్ ఎక్స్‌పోజింగ్ చేయాలి, హద్దులు లేకుండా నటించాలి అనే అపోహ ఉంటుంది. సినిమాలోని క్యారెక్టర్ డిమాండ్ చేయనంత వరకు ఏ హీరోయిన్ కూడా అలా చేయడానికి ఇష్టపడదు. కానీ అలాంటి క్యారెక్టర్స్‌ను కూడా వదులుకునే హీరోయిన్స్ ఉన్నారు. వాటి వల్లే తనకు వచ్చిన బాలీవుడ్ బడా ఆఫర్స్‌పు వదిలేసుకున్న విషయాన్ని ఇటీవల బయటపెట్టింది అమృతా రావు.

మహేశ్ నటించిన 'అతిథి' చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యింది అమృతా రావు. ఈ సినిమా కమర్షియల్‌గా అంత సక్సెస్ కాకపోవడంతో తనకు తెలుగు నుండి మరో అవకాశం రాలేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం అమృతాకు చాలానే క్రేజ్ ఉంది. చాలాకాలం క్రితం అమృతా, షాహిద్ కపూర్ జంటగా నటించిన 'వివాహ్' చిత్రం ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్.

వివాహ్ సినిమా తర్వాత అమృతాకు బాలీవుడ్‌లో చాలానే అవకాశాలు వచ్చాయి. కానీ తాను ముద్దు సీన్లలో మాత్రం నటించకూడదని రూల్ పెట్టుకుందట. అందుకే చాలావరకు ఆఫర్లను రిజెక్ట్ చేస్తూ వచ్చానని తెలిపింది. అయితే తాను ఎంతగానో ఎదురుచూసిన యశ్ రాజ్ ఫిల్మ్స్ ఆఫర్ కూడా తాను ఈ కారణంగానే రిజెక్ట్ చేసిందట.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్‌లో నటించాలని చాలామంది నటీనటుల కోరిక. అలాగే అమృతా రావు బీ టౌన్‌లో బాగా బిజీగా ఉన్న సమయంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ తనకు రెండు సినిమాల ఆఫర్లు ఇచ్చిందట. కానీ వాటిలో ముద్దు సీన్లు ఉండడంతో తాను ఆ రెండిటిని రిజెక్ట్ చేశానన్న విషయాన్ని తాజాగా ఓ యూట్యూబ్ వీడియోలో బయటపెట్టింది అమృతా రావు.

Tags

Read MoreRead Less
Next Story