Anandam Movie: 'ఆనందం' సినిమా ఎన్ని భాషల్లో రీమేక్ అయ్యిందో తెలుసా?

Anandam Movie: ఆనందం సినిమా ఎన్ని భాషల్లో రీమేక్ అయ్యిందో తెలుసా?
Anandam Movie: శ్రీను వైట్ల.. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమాలే.

Anandam Movie: శ్రీను వైట్ల.. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమాలే. ఒకప్పుడు ఈ సినిమాలకు మూవీ లవర్స్‌లో చాలా క్రేజ్ ఉండేది. శ్రీను వైట్ల, బ్రహ్మానందం కాంబినేషన్‌కు ఉన్న ఫ్యాన్‌బేస్ అంతా ఇంతా కాదు. కానీ మెల్లమెల్లగా తన కామెడీ ప్రేక్షకులకు రొటీన్ అయిపోయింది. ప్రతీ సినిమాను కామెడీతో కాపాడలేనని శ్రీను వైట్లకు కూడా అర్థమయింది. అందుకే గత కొంతకాలంగా తన రొటీన్ ఫార్ములాను పక్కన పెట్టి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.

కానీ ఒకప్పుడు శ్రీను వైట్లలో ఉండే స్పార్క్ ఇప్పుడు లేదు. ఆయన మార్కెట్ కూడా పూర్తిగా పడిపోయింది. కామెడీ సినిమాలు తీయడంలో దిట్ట అనిపించుకున్న శ్రీను వైట్ల డెబ్యూ.. తనకు మాత్రమే కాదు మూవీ లవర్స్ అందరికీ చాలా స్పెషల్. తన డెబ్యూ చిత్రం విడుదలయ్యి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా మరోసారి ఆ 'ఆనందం' జ్ఞాపకాలను గుర్తుచేసుకుందాం..

ఫస్ట్ హాఫ్ అంతా యూత్‌ను ఆకట్టుకునే కామెడీ, సెకండ్ హాఫ్ అంతా మనసుకు హత్తుకునే ప్రేమకథ.. ఈ రెండిటి కలయికే ఆనందం. ముఖ్యంగా కాలేజీలో హీరో, హీరోయిన్ మధ్య జరిగే సన్నివేశాలు ఇప్పటికీ యూత్‌కు ఈజీగా కనెక్ట్ అయిపోతాయి. ఇక ఇందులో నటించిన ఆకాశ్ ఈ ఒక్క సినిమాతో మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోగా మారిపోయాడు. ఐశ్వర్య పాత్రలో నటించిన రేఖ కూడా తన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది.

అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వచ్చి సంగీత దర్శకుడిగా నిరూపించుకుంటున్న దేవీ శ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమాతో తన మ్యూజిక్ పవర్ ఏంటో చూపించాడు. అందుకే ఇప్పటికీ ఆనందం సినిమా పాటలకు విపరీతమైన క్రేజ్ ఉంది. 2001లో విడులయిన ఆనందం చాలా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా 200 రోజులు ఆడింది. శ్రీను వైట్లతో పాటు ఆకాశ్, రేఖ ఇద్దరికీ ఇది డెబ్యూ మూవీనే అయినా అందరికీ గుర్తుండిపోయే మార్క్‌ను క్రియేట్ చేసారు.

తమిళంలో 'ఇనిదు ఇనిదు కాదల్‌ ఇనిదు', కన్నడలో 'ఆనంద' పేరుతో రీమేక్ అయిన ఆనందం అక్కడ కూడా మంచి టాక్‌నే అందుకుంది. ఎన్ని సంవత్సరైనా మూవీ లవర్స్ అస్సలు మర్చిపోలేని యూత్‌ఫుల్ మూవీగా ఆనందం నిలిచిపోతుంది.

Tags

Read MoreRead Less
Next Story