సినిమా

Ananya Panday: తమిళ స్టార్ హీరో సినిమాలో అనన్య పాండేకు ఛాన్స్.. కానీ..

Ananya Panday: బాలీవుడ్‌లో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వివాదం ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు.

Ananya Panday (tv5news.in)
X

Ananya Panday (tv5news.in)

Ananya Panday: బాలీవుడ్‌లో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వివాదం ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. ఇప్పటివరకు ఆర్యన్ ఖాన్ మాత్రమే అందులో శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ తాజాగా అనన్య పాండే ఇంట్లో కూడా ఎన్‌సీబీ సోదాలు జరిగాయి. ఈ విషయంలో అనన్యను అధికారులు విచారణ కూడా చేశారు. ఈ కేసుతో అనన్యకు సంబంధం ఉన్నా లేకపోయినా తన కెరీర్‌కు మాత్రం ఇది పెద్ద బ్రేక్‌లాగా మారుతుంది అంటున్నారు ప్రేక్షకులు.

ఇప్పుడిప్పుడే అనన్య పాండే బాలీవుడ్‌లో పేరు తెచ్చుకుంటోంది. ఎక్కువ ఫ్యాన్‌బేస్ ఉన్న బాలీవుడ్ యంగ్ బ్యూటీల్లో తాను కూడా ఒకరుగా మారుతోంది. ఈ సమయంలో తనను డ్రగ్స్ కేసుపై విచారించడం చూస్తుంటే తనకు వస్తున్న సినిమా ఛాన్సులు కూడా వెనక్కి వెల్లిపోతున్నాయి అంటున్నారు సన్నిహితులు. ఇలాగే ఒక సౌత్‌ మూవీలో నటించే ఛాన్స్‌ను మిస్ చేసుకుందట అనన్య.

అనన్య తెలుగులో లైగర్ మూవీతో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది కాబట్టి దర్శకుడు పూరీ జగన్నాధ్ ఏ హడావిడి లేకుండా ఇంట్రెస్టింగ్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విజయ్ దేవరకొండతో తెలుగులో డెబ్యూ చేస్తుంది కాబట్టి అప్పుడే అనన్య పేరు టాలీవుడ్‌లో పాపులర్ అయ్యింది. అయితే కోలీవుడ్‌లో కూడా ఒక క్రేజీ యాక్టర్‌తో నటించే ఛాన్స్ వచ్చిందట అనన్యకు.

తమిళ హీరో విజయ్ ప్రస్తుతం బీస్ట్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే మరో సినిమా సెట్లో అడుగుపెట్టనున్నాడు విజయ్. అయితే ఆ అప్‌కమింగ్ సినిమాలో ఒక హీరోయిన్‌గా అనన్య పాండేను ఎంపిక చేయాలని మేకర్స్ భావించారట కానీ ఎన్‌సీబీ విచారణ నేపథ్యంలో వారు ఈ ఆలోచనను విరమించుకున్నట్టు సమాచారం. ఎంతైనా తెలుగులో విజయ్ దేవరకొండతో నటిస్తున్న అనన్య.. తమిళంలో విజయ్‌తో నటించే ఛాన్స్ ఇప్పటికి మిస్ చేసుకున్నట్టే..

Next Story

RELATED STORIES