సినిమా

Anasuya Remuneration : 'దాక్షాయని' తగ్గేదే... లే.. పుష్పకి షాకింగ్ రెమ్యునరేషన్..!

Anasuya Remuneration : సరైన పాత్ర పడితే కానీ నటుడు అనే వాడు బయటకు రాడు.. అలాగే రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి అందరిని ఆశ్చర్యపరిచింది

Anasuya Remuneration :  దాక్షాయని తగ్గేదే... లే.. పుష్పకి షాకింగ్ రెమ్యునరేషన్..!
X

Anasuya Remuneration : సరైన పాత్ర పడితే కానీ నటుడు అనే వాడు బయటకు రాడు.. అలాగే రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి అందరిని ఆశ్చర్యపరిచింది బుల్లితెర యాంకర్ అనసూయ. ఆమె నటనకి విమర్శకుల చెత ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. అయినప్పటికీ మంచి పాత్ర వస్తే కానీ మరో సినిమాకి కమిట్ అవ్వలేదు అనసూయ.

ఇటీవలే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రలో మెరిసింది. అయితే ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ రెండో పార్ట్‌‌‌‌లో మరింతగా ఉంటుందని తెలుస్తోంది. పుష్ప పై తన పగను భర్త మంగళంశీను, పొలీస్ ఆఫీసర్ ఫాహద్‌ ఫాజిల్‌తో కలిసి తీర్చుకునేలా పవర్‌‌‌ఫుల్‌‌‌గా ఉంటుందట. ఇదిలావుండగా పుష్ప సినిమాకి ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌‌గా మారింది.

ఈ సినిమాకి అనసూయ మొత్తం పదిరోజుల కాల్షిట్లు ఇచ్చిందట.. ఒక్కరోజుకు గాను అనసూయ రూ. 1-1.5లక్షల రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిందని తెలుస్తోంది. ఈ లెక్కన ఆమెకి పుష్ప చిత్రానికి గాను దాదాపు రూ.12 లక్షల వరకు ముట్టినట్టు సమాచారం.

Next Story

RELATED STORIES