Anchor Suma: నేనా..? సినిమానా..? అంటున్న సుమ..

Anchor Suma (tv5news.in)

Anchor Suma (tv5news.in)

Anchor Suma: అనర్గళంగా మాట్లాడే తత్వం.. ప్రశ్నలకు ఎదురుప్రశ్నలు వేసే గుణం..

Anchor Suma: అనర్గళంగా మాట్లాడే తత్వం.. ప్రశ్నలకు ఎదురుప్రశ్నలు వేసే గుణం.. టైమ్‌కు తగినట్టుగా ప్రాసలు, పంచ్‌లు.. ఎవరూ బీట్ చేయలేని కామెడీ టైమింగ్.. ఇవన్నీ ఒకే మనిషిలో ఉంటాయా..? ఒకవేళ ఉన్నా తన మ్యాజిక్ ఎన్ని రోజులని పనిచేస్తుంది..? ఈ ప్రశ్నలకు నిలువెత్తు సమాధానమే యాంకర్ సుమ. ఈ బుల్లితెర సెన్సేషన్ మరోసారి వెండితెరపై మెరవనుందట.

సుమ తర్వాత ఎంతోమంది యాంకర్లు బుల్లితెరపై అడుగుపెట్టారు. కానీ సుమకు ఉన్న క్రేజ్‌ను మాత్రం ఎవరూ అందుకోలేకపోయారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా, ఆడవాళ్లను కట్టిపడేసే షోలు అయినా.. సుమ ఉంటేనే దానికి ఒక బ్యూటీ యాడ్ అవుతుందని చాలామంది బలంగా నమ్ముతారు. తన వాక్ చాతుర్యాన్ని కొట్టే యాంకర్ ఇంక ఇండస్ట్రీలోకి రాదేమో అన్నట్టుగా అనిపిస్తుంటుంది సుమ ఛార్మ్ చూస్తుంటే.

యాంకర్‌లలో ఎవరూ లేనంత బిజీగా సుమ ఉంటుంది. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోగానే మరో మూవీ ఈవెంట్.. ఒక షో అయిపోగానే మరో షో.. ఒక భాష అయిపోగానే మరో భాష.. ఇలా బుల్లితెర అంతా చుట్టే్స్తూ ఎక్కడ చూసినా తనే కనిపిస్తుంటుంది. అయితే తాజాగా సుమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో అనేక అనుమానాలకు దారితీస్తోంది.

సుమ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. తాజాగా తాను సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నానంటూ సుమ పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది. సుమ సినిమాల్లో నటిస్తుందా అంటూ నెటిజన్లు ప్రశ్నించేలా చేస్తోంది. కెరీర్ మొదట్లో పలు సినిమాల్లో తళుక్కున మెరిసిన సుమ.. దాదాపు ఎనిమిదేళ్లుగా వెండితెరపై కనిపించలేదు. ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత సుమ వెండితెర రీ ఎంట్రీ గురించి తన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story