సినిమా

Anee Master : యానీ మాస్టర్‌‌కు 'మెగా' ఆఫర్... ఖుషీలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

Anee Master : యానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో సినిమాలకి ఆమె కొరియోగ్రాఫర్‌ చేశారు..

Anee Master : యానీ మాస్టర్‌‌కు మెగా ఆఫర్... ఖుషీలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌
X

Anee Master : యానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో సినిమాలకి ఆమె కొరియోగ్రాఫర్‌ చేశారు.. ఇప్పుడామె మోస్ట్ వాంటెడ్ కొరియోగ్రాఫర్‌ లలో ఒకరు.. తెలుగు బిగ్‌‌‌బాస్ సీజన్ 5 లోకి వెళ్ళాక ఆమెకి మరింత క్రేజ్ పెరిగింది.. 11 వారాలు హౌజ్ లోనే ఉండి ఎలిమినేట్ అయింది ఆమె.

ఇదిలావుండగా ఆమెకి రెండు బంపర్ ఆఫర్స్ వచ్చాయి. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్‌ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి, వెన్నెల కిషోర్‌ల పక్కనే ఉండే సీన్స్ లలో నటించే అవకాశం వచ్చినట్టుగా యానీ మాస్టర్ చెప్పుకొచ్చింది.


అంతేకాకుండా ఈ మూవీకి కొరియోగ్రఫీ కూడా చేస్తున్నట్టుగా వెల్లడించింది. ఈ ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు మెహర్‌ రమేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. కాగా ఈ సినిమాలో మరో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ లోబో కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే. తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కీలక పాత్ర పోషిస్తోంది.

Next Story

RELATED STORIES