సినిమా

Anee Master : యానీ మాస్టర్‌ కు కళ్ళుచెదిరే రెమ్యునరేషన్..!

Anee Master : బిగ్‌బాస్ ట్రోఫితో ఇళ్లు చేరాలనుకున్న సినీ కొరియోగ్రాఫర్‌ యానీ మాస్టర్‌ కల కలగానే మిగిలిపోయింది.

Anee Master : యానీ మాస్టర్‌ కు కళ్ళుచెదిరే రెమ్యునరేషన్..!
X

Anee Master : బిగ్‌బాస్ ట్రోఫితో ఇళ్లు చేరాలనుకున్న సినీ కొరియోగ్రాఫర్‌ యానీ మాస్టర్‌ కల కలగానే మిగిలిపోయింది. 11వ వారం హౌస్‌ నుంచి అమె ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చేసింది. అయితే 11 వారాలకి గాను ఆమెకి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సెలబ్రిటీలు, వారికున్న క్రేజ్ ని బట్టి రెమ్యునరేషన్ అనేది ఉంటుంది. ఇండస్ట్రీలో యానీ మాస్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది. స్టార్ హీరోలతో కలిసి ఆమె పనిచేశారు. దీనితో ఆమెకి షో నిర్వాహకులు బాగానే ముట్టజెప్పారని సమాచారం. సోషల్ మీడియాలో వినిపిస్తోన్న వార్తల ప్రకారం .. యానీకి ఒక్క వారానికి రెండున్నర నుంచి మూడు లక్షల మేర పారితోషికం ఇస్తున్నారట, అంటే అమెకి దాదాపుగా ముపై లక్షల వరకు ముట్టినట్టుగా తెలుస్తోంది. ఇక మోనాల్‌ చెప్పినట్లుగా ఈ డబ్బుతో యానీ సొంతింటి కల నెరవేరుతుందేమో చూడాలి.

Next Story

RELATED STORIES