Animal: అత్యంత ఖరీదైన టికెట్ ధర రూ. 2,200

Animal: అత్యంత ఖరీదైన టికెట్ ధర రూ. 2,200
డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో వెండితెరపైకి రానున్న 'యానిమల్'

రణబీర్ కపూర్ , రష్మిక మందన్న, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'యానిమల్' ఈ సంవత్సరం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ట్రైలర్ విడుదలైన వెంటనే, ఈ చిత్రంపై అన్ని చోట్లా హైప్ ఏర్పడింది. నవంబర్ 25 న మేకర్స్ ఈ చిత్రం కోసం టిక్కెట్ విండోను తెరిచారు. ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో టిక్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, సినీ ప్రేక్షకులు ఎటువంటి ఛాన్స్ నూ వదులుకోవట్లేదు. భారీ సంఖ్యలో తమ సీట్లను ధృవీకరించారు. ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదిక ప్రకారం, బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని INOX మైసన్ జియో వరల్డ్ ప్లాజాలో అర్థరాత్రి ప్రదర్శన కోసం ముంబైలో అత్యంత ఖరీదైన టికెట్ ధర రూ. 2,200. సాక్‌నిల్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకారం, యానిమల్ తొలిరోజు రూ. 50 కోట్ల నికర వసూళ్లు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

'యానిమల్' ట్రైలర్ పెద్ద హిట్

యానిమల్ ట్రైలర్ విడుదలైన వెంటనే, అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిమాన నటుల ఫొటోలు, ట్రైలర్ ను షేర్ చేయడం మొదలుపెట్టారు. రణ్‌బీర్‌ కపూర్‌, అనిల్‌ కపూర్‌ల తండ్రీకొడుకుల పాత్రలు రివర్స్‌ చేసిన ఓ సన్నివేశం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ సన్నివేశంలో, రణబీర్ మైఖేల్ జాక్సన్ కచేరీకి అనుమతి కోరుతూ తన తండ్రిని చిన్నవాడిగా నటించమని అడుగుతాడు. అనిల్ చిన్నవాడైన రణబీర్ ''పాపా, పాపా, పాపా'' అని అంటున్నప్పుడు రణబీర్ ''నేను వినగలను, నేను చెవిటివాడిని కాదు'' అని అరుస్తూ తండ్రి కొడుకుల పాత్రను అందంగా చూపించారు. దీన్ని బట్టి చూస్తుంటే రణబీర్, అనిల్ కపూర్ మధ్య సంబంధం విలక్షణమైనది, ఎంతో ఆసక్తికరమైనదిగా తెలుస్తోంది.

సినిమా గురించి

'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన పాన్-ఇండియా చిత్రంలో అనిల్ కపూర్, రష్మిక మందన్న కూడా నటించారు. ఈ సినిమా తండ్రీ కొడుకుల చుట్టూ తిరుగుతుంది. ఇది విపరీతమైన రక్తపాతం నేపథ్యంలో సాగుతుంది. కుమార్ అండ్ క్రిషన్ కుమార్ టి-సిరీస్, మురాద్ ఖేతాని యొక్క సినీ1 స్టూడియోస్, ప్రణయ్ రెడ్డి వంగా యొక్క భద్రకాళి పిక్చర్స్ నిర్మించిన 'యానిమల్' డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో వెండితెరపైకి రానుంది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి 'A' సర్టిఫికేట్ మంజూరు చేయబడింది. దీని రన్‌టైమ్ 3 గంటల 21 నిమిషాల 23 సెకన్లకు పైగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story