Anubhavinchu Raja Movie: హిట్ టాక్ తో దూసుకుపోతోన్న అనుభవించు రాజా..

Anubhavinchu Raja Movie: హిట్ టాక్ తో దూసుకుపోతోన్న అనుభవించు రాజా..
Anubhavinchu Raja Movie: సినిమా ప్రధాన ఉద్దేశ్యం వినోదం అందించడం.

Anubhavinchu Raja Movie: సినిమా ప్రధాన ఉద్దేశ్యం వినోదం అందించడం. దానికి కాస్త ఎమోషన్, మరికాస్త యాక్షన్ జోడించి ఎంచుకున్న కథకు న్యాయం చేస్తే ప్రేక్షకుడికి అంతకు మించిన వినోదం ఏముంటుంది. అలాగే ఓ చిన్న పాయింట్ చుట్టూ కథనం అల్లుకుని.. సినిమా ఆసాంతం ఆకట్టుకునేలా రూపొందిన సినిమా అనుభవించు రాజా.

రాజ్ తరుణ్, కషిష్ ఖాన్ జంటగా నటించిన ఈ మూవీ ఈ శుక్రవారం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విపరీతమైన డబ్బున్న ఓ కుర్రాడు.. ఆ దీమాతో ఏదైనా సాధించగలను అన్న అతి నమ్మకంతో ఉంటాడు. అదే అతన్ని అనుకోని చిక్కుల్లో పడేస్తుంది. అక్కడి కథ కొత్త టర్న్ తీసుకుని.. ఊహించని మలుపులతో(ఇవేమీ భారీగా ఉండవు. కానీ ఊహించని విధంగా సాగుతాయి) ట్విస్టీగా ఉంటూనే ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా సాగుతుంది.

నిజానికి ఇది భారీ సినిమా కాదు. సాధారణ కథకే రాజ్ తరుణ్ ఇమేజ్ కు తగ్గ కథనం అద్దుకుని.. ఆడియన్సెస్ కు వినోదాన్ని అందించడమే ప్రధానంగా రూపొందిన సినిమా. ఆ మేరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో అనుభవించు రాజా ఏ మాత్రం డిజప్పాయింట్ చేయదు. ఫస్ట్ హాఫ్ లో సెక్యూరిటీ గార్డ్ గా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న రాజ్ తరుణ్ సెకండ్ హాఫ్ జల్సా రాయుడుగా, మైనర్ బాబు లాంటి పాత్రలో బలే సెట్ అయిపోయాడు.

గ్రామీణ రాజకీయాలు, అమాయకత్వాలు, ఈగోలు, జెలసీలు అన్నీ కలిపి ఉన్నా.. భీమవరం లాంటి ప్రాంతాల్లో పండగ సందడి ఎలా ఉంటుందనే విషయాల్లో దర్శకుడు తీసుకున్న జాగ్రత్తలు రాసుకున్న కథనం సహజంగా మెప్పిస్తుంది. ఇక ఫైట్స్ విషయంలో కూడా రాజ్ తరుణ్ స్టేచర్ కు తగ్గట్టుగా అత్యంత సహజమైన పోరాట సన్నివేశాలతో ఆకట్టుకున్నారు.

నిజంగా శారీరకంగా బలహీనంగా ఓ వ్యక్తి బలవంతులను ఇలా ఎదుర్కోవచ్చు అన్నంత నేచురల్ గా కంపోజ్ చేశారు ఫైట్స్ ను. పాటలు కొంత నిరాశపరిచినా.. టైటిల్ సాంగ్ వినబుల్ గానూ చూడబుల్ గానూ ఉంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా హీరోయిన్ ఎనర్జిటిక్ గా ఉంది. ఈ ఇద్దరి మధ్య ప్రేమకథ కూడా రొటీన్ గా కాక కాస్త మెచ్యూర్డ్ గా ఉంటుంది.

Anubhavinchu Raja Movieలవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాకుండా.. క్యారెక్టర్ ను బట్టి పెరిగే ప్రేమకథగా అనుభవించు రాజా ఖచ్చితంగా మెప్పిస్తుంది. మొత్తంగా కొన్ని మైనస్ లు ఉన్నా.. ఇలాంటి చిన్న సినిమాలకు అవేమీ పెద్ద ఆటంకం కాదు. చూస్తున్నంత సేపూ ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేస్తే ఆడియన్సెస్ అంతకు మించి ఏం కోరుకుంటారు.. అదే మీ ఒపీనియన్ అయితే అనుభవించు రాజా థియేటర్ లో చూసేందుకు ఓ మంచి ఛాయిస్ అనే చెప్పాలి.

Tags

Read MoreRead Less
Next Story