AR Rahman: చాలా రోజుల తర్వాత జానపద గీతం

AR Rahman: చాలా రోజుల తర్వాత జానపద గీతం
ఈ తరహా సినిమాలకు సంగీతం అందించడం ఓ కొత్త అనుభూతని చెప్పారు

నాయకుడు సినిమాకు సంగీతాన్ని అందించడం సంతోషంగా ఉందన్నారు ఏఆర్ రెహమాన్. తమిళంలో తాజాగా సంచలనం సృష్టించిన 'మామన్నన్' తెలుగులో 'నాయకుడు'గా విడుదల కానుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా జులై 14న రిలీజ్ కానంది. ఇందులో ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహాద్ ఫాజిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు.




సినిమా ప్రమోషన్ లో భాగంగా ఏఆర్ రెహమాన్ మీడియాతో మాట్లాడారు. 'నాయకుడు' సినిమా తనకు నచ్చిన సినిమాలలో ఒకటని చెప్పారు. ఉదయనిధి స్టాలిన్ ముందుగా తనను సంప్రదించారని అన్నారు. కథ వినగానే చాలా ఆసక్తిగా అనిపించిందని చెప్పారు. దర్శకుడు మారి సెల్వరాజ్ ఇంతకు ముందు తీసిన సినిమాలు పవర్‌ఫుల్‌గా ఉన్నాయని. అన్నారు. తొలుత ఒక పాట చాలు అన్నారు. నేనూ ఒక పాట ఇచ్చాను. మిగతా పాటలకు షూటింగ్ చేశాక బాణీలు అందించాను. ప్రతి పాటకు ఒక అర్థం ఉంటుందని చెప్పారు.


ఉదయనిధి స్టాలిన్, మారి సెల్వరాజ్ తో మొదటిసారి 'నాయకుడు' కోసం పని చేశానని అన్నారు. ఈ కథ చాలా స్ఫూర్తివంతంగా ఉంటుందని చెప్పారు. ఇదొక టఫ్ సబ్జెక్టని అన్నారు. ఈ సినిమాలో సమాజంలోని అసమానతలతో పాటు మరెన్నో విషయాల గురించి చర్చించారని అన్నారు. ఈ తరహా సినిమాలకు సంగీతం అందించడం ఓ కొత్త అనుభూతని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story