AR Rahman Concert Twist: వీడియోలోని ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన విజయ్ ఆంటోని

AR Rahman Concert Twist: వీడియోలోని ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన విజయ్ ఆంటోని
రెహమాన్ సంగీత కచేరిపై తీవ్ర విమర్శలు.. స్పందించిన విజయ్ ఆంటోని

ఆస్కార్-విజేత సంగీత మాస్ట్రో AR రెహమాన్ సెప్టెంబర్ 10న చెన్నైలో ఒక సంగీత కచేరీని నిర్వహించారు. ఈ జీవితకాల ప్రదర్శనను చూసేందుకు అభిమానులు వేదికపైకి వస్తుండగా, వారు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. వేదిక వద్ద భారీ జనసందోహం తొక్కిసలాట వంటి పరిస్థితికి దారితీసింది. దీంతో ప్రజలు తమ భయానక అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

కచేరీకి హాజరైన చాలా మంది వ్యక్తులు సోషల్ మీడియాలో మహిళలు వేధింపులకు గురిచేశారని, గుంపు కారణంగా పిల్లలు తప్పిపోయారని పంచుకున్నారు. కొందరు ఖరీదైన టిక్కెట్లు కొనుగోలు చేసినప్పటికీ వేదికలోకి ప్రవేశించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఒక కొత్త వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. దీనిలో ఒక మహిళ మొత్తం సంఘటనను ఆర్కెస్ట్రేట్ చేసిందని, సంగీత స్వరకర్త విజయ్ ఆంటోని ఇందులో హస్తం ఉందని పేర్కొంది.

ఈ వీడియో వైరల్ కావడంతో ఆంటోనీని నెటిజన్లు నిందించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో విజయ్ ఆంటోనీ ఇప్పుడు తన మౌనాన్ని వీడిలాని నిర్ణయించుకున్నారు. ఆంటోనీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో వీడియోకు వ్యతిరేకంగా ఓ అధికారిక నోట్‌ను షేర్ చేశాడు. తనపై అసత్యాలు వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బెదిరించాడు. "నా హృదయం బాధతో, కొనసాగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి నేను ఈ లేఖ రాస్తున్నాను. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఒక సోదరి నా గురించి, నా సోదరుడు ఏఆర్ రెహమాన్ గురించి అసత్యాలు ప్రచారం చేస్తోంది. అవి పూర్తి అబద్ధాలు. నేను వారిపై పరువునష్టం కేసు ఫైల్ చేయబోతున్నాను" అని నోట్‌లో రాశారు. దీంతో ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

కచేరీ ముగిసిన మరుసటి రోజు, నిర్వాహకులు వేదిక వద్ద అసౌకర్యానికి, గందరగోళానికి అభిమానులకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. రద్దీ కారణంగా వేదికపైకి ప్రవేశించలేని వారికి టిక్కెట్ మొత్తాన్ని తిరిగి ఇస్తామని వారు హామీ ఇచ్చారు. కచేరీ కోసం వేదిక వద్ద దాదాపు 50,000 మంది ఉన్నారు, కానీ నిర్వాహకులు కేవలం 20,000 మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతిని పొందారు. దీంతో నిర్వాహకులు ఈ గందరగోళానికి బాధ్యత వహించారు. ఈ పరిస్థితితో రెహ్మాన్‌కు ఎటువంటి సంబంధం లేదని, ఎవరూ దాడి చేయవద్దని వారు నెటిజన్లను వేడుకున్నారు.


Tags

Read MoreRead Less
Next Story