సినిమా

Arvind Trivedi Passes Away: రావణాసురుడి పాత్రధారి అరవింద్ త్రివేది కన్నుమూత..

Arvind Trivedi Passes Away: ఇటీవల కాలంలో సినీ పరిశ్రమ ఎందరో గొప్ప నటీనటులను పోగొట్టుకుంది.

Arvind Trivedi Passes Away: రావణాసురుడి పాత్రధారి అరవింద్ త్రివేది కన్నుమూత..
X

Arvind Trivedi Passes Away: ఇటీవల కాలంలో సినీ పరిశ్రమ ఎందరో గొప్ప నటీనటులను పోగొట్టుకుంది. తాజాగా మరో సీనియర్ నటుడు అనారోగ్య సమస్యతో కన్నుమూసాడు. హిందీ సీరియల్ 'రామాయణ్'లో రావణుడి పాత్ర పోషించిన అరవింద్ త్రివేది మంగళవారం ఉదయం ముంబాయిలో మరణించారు. 82 ఏళ్ల వయసున్న త్రివేది ఎన్నో సీరియళ్లతో, సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా రామాయణ్ సీరియల్‌లో ఆయన చేసిన రావణుడి పాత్ర ఆయన అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నటుడిగానే కాదు రాజకీయ నాయకుడిగా కూడా ఆయన ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. ఆయన మరణం తీరని లోటని బాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

Next Story

RELATED STORIES