Ashish 3 : పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న దిల్ రాజు కొడుకు మూడో సినిమా

Ashish 3 : పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న దిల్ రాజు కొడుకు మూడో సినిమా
ఆశిష్ రెడ్డి మూడో సినిమాపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేసిన మేకర్స్

'రౌడీ బాయ్స్' సినిమాతో దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన ఆశిష్ రెడ్డి.. మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం 'సెల్ఫిష్; అనే సినిమాలో ఆశిష్ నటిస్తున్నారు. సెల్ఫిష్ సినిమా చివరి దశకు చేరుకోవడంతో ఆయన మూడవ చిత్రాన్ని ప్రారంభించారు. 'ఆశిష్ 3' అనే తాత్కాలికంగా పేరు పెట్టిన మూవీతో రాబోతున్న ఈ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలు చేసుకుంది. ఈ కార్యక్రమానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు.


ఆశిష్ రెడ్డి, విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమాకు ఏం ఏం కీరవాణి సంగీతం అందించనున్నారు. అలాగే అగ్ర సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కెమెరామెన్ గా వ్యవహరించనున్నారు. ఈ ప్రాజెక్టుపై గత కొన్ని రోజుల నుంచి పలు వార్తలు వినిపిస్తుండగా.. మేకర్స్ ఎట్టకేలకు ఈ రోజు ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఆశిష్ కోసం దిల్ రాజు పెద్ద ప్లానింగే వేసినట్టు స్పష్టమవుతుంది. ఎలాగైన ఆశిష్ ను అగ్ర స్థాయి హీరోను చేయడానికి ప్రయత్నిస్తున్న దిల్ రాజు ప్రయత్నాలు మరి ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. కాగా ఈ సినిమా పక్కా యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్టు సమాచారం.

'రౌడీ బాయ్స్' సినిమాతో హీరోగా పరిచయమై, ప్రేక్షకులను మెప్పించిన ఆశిష్ రెడ్డి, ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు విశాల్ కాశీ అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో రాబోతున్న 'సెల్ఫిష్' అనే సినిమా చేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్, దిల్ రాజు హోమ్ బ్యానరైన శ్రీ వెంటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలనే షూటింగ్ కంప్లిట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

Tags

Read MoreRead Less
Next Story