సినిమా

Unstoppable With NBK: అన్‌స్టాపబుల్ షోలో వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..

Unstoppable With NBK: సోషల్ మీడియాలో నిజాల కంటే అబద్ధాలే ఎక్కువ ఫాస్ట్‌గా అందరికీ చేరుతాయి.

Unstoppable With NBK: అన్‌స్టాపబుల్ షోలో వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..
X

Unstoppable With NBK: సోషల్ మీడియాలో నిజాల కంటే అబద్ధాలే ఎక్కువ ఫాస్ట్‌గా అందరికీ చేరుతాయి. అందుకే దానిపై స్పందించినా.. లాభం లేదని చాలామంది సెలబ్రిటీలు సైలెంట్‌గా ఉండిపోతారు. మరికొందరు మాత్రం నోరు తెరిచి ఈ రూమర్స్‌ను ఖండిస్తారు. ఎంత ఖండించినా కూడా అలాంటి రూమర్స్‌కు పూర్తిగా ఫుల్‌స్టాప్ పడదు. తాజాగా బాలయ్య కూడా ఇలాంటి వాటి గురించి తన అన్‌స్టాపబుల్ షోలో స్పందించారు.

టాలీవుడ్ హీరోల్లో బాలయ్య రూటే సెపరేటు. ఆయన ఆఫ్ స్క్రీన్ బిహేవియర్‌ను అర్థం చేసుకోవడం ఎవ్వరి తరం కాదు. ఆయనకు కోపంతో పాటు ప్రేమతో కూడా ఎక్కువే. అందుకే ఆయన ఆన్ స్క్రీన్ యాక్టింగ్‌కు మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ బిహేవియర్‌కు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఏదైనా సూటిగా మాట్లాడేస్తారన్న విషయం కూడా అందరికీ తెలుసు. తాజాగా అన్‌స్టాపబుల్ షోలో ఓ విషయం గురించి ఘాటుగానే స్పందించారు బాలయ్య.

'ఇవాళ్టి ప్రపంచంలో ప్రతివాడు సోషల్‌ మీడియాలో ఏం అనాలనిపిస్తే అది అంటున్నారు. పేరు లేని, లొకేషన్‌ తెలియని అడ్రస్‌లతో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. బాలకృష్ణకి రవితేజకి పడదు.. చిరంజీవి, బాలకృష్ణ ఫోన్‌లో మాట్లాడుకోరు.. నా హీరో తోపు.. నీ హీరో సోపు అంటూ పిచ్చిరాతలు రాస్తున్నారు.' అంటూ సోషల్ మీడియాపై ఫైర్ అయ్యారు బాలయ్య.

'లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయ్యింది .. దొరికితే దవడ పగిలిపోద్దీ' అంటూ ఫేక్ న్యూస్‌పై విరుచుకుపడ్డారు. అంతే కాకుండా మన మీద వచ్చే విమర్శలను కూడా ప్రేమించినప్పుడే మనం అన్‌స్టాపబుల్ అవుతాం అని అందరినీ మెటివేట్ చేశారు. ప్రస్తుతం అన్‌స్టాపబుల్ షోలో ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story

RELATED STORIES