Lakshmi Narasimha : లక్ష్మీనరసింహాకి 18 ఏళ్ళు.. రిలీజ్ రోజునే పొలీస్ ప్రొటెక్షన్..!

Lakshmi Narasimha : లక్ష్మీనరసింహాకి 18 ఏళ్ళు.. రిలీజ్ రోజునే పొలీస్ ప్రొటెక్షన్..!
Lakshmi Narasimha : సంక్రాంతి అంటే బాలయ్య... బాలయ్య అంటే సంక్రాంతి.. సంక్రాంతికి బాలయ్య పంజా విసురితే ఎలాగుంటుందో నరసింహనాయిడు, సమరసింహారెడ్డి సినిమాలు రుచిచూపించాయి.

Lakshmi Narasimha : సంక్రాంతి అంటే బాలయ్య... బాలయ్య అంటే సంక్రాంతి.. సంక్రాంతికి బాలయ్య పంజా విసురితే ఎలాగుంటుందో నరసింహనాయిడు, సమరసింహారెడ్డి సినిమాలు రుచిచూపించాయి. అలా 2004 జనవరి 14న సంక్రాంతికి లక్ష్మీనరసింహా చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు బాలయ్య, జయంత్ సి. పరాంజి దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్‌‌లో పవర్‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి ఆదరగోట్టేశారు బాలకృష్ణ. ఈ సినిమాకి నేటితో 18 ఏళ్ళు పూర్తి అయ్యాయి.

తమిళ్‌‌లో విక్రమ్ నటించిన సామి సినిమాకి ఇది రీమేక్. ముందుగా ఈ సినిమాకి వివి వినాయక్, భీమినేని శ్రీనివాస్ రావులను దర్శకులుగా అనుకున్నారు. కానీ ఈశ్వర్ తర్వాత స్టార్ లతో సినిమాల చేసేందుకు ఎదురుచూస్తున్న దర్శకుడు జయంత్ కి ఈ ఆఫర్ దక్కింది. పరిచూరి బ్రదర్స్ కొన్ని మార్పులతో స్క్రిప్ట్ అంతా సిద్దం చేశారు. ముందుగా హీరోయిన్‌‌గా శ్రియని అనుకున్నారు. ఆ తర్వాత అసిన్‌‌ని తీసుకున్నారు. విలన్‌‌గా ప్రకాష్ రాజ్‌‌ని ఎంపిక చేశారు. ముందుగా అనుకున్న టైటిల్ నరసింహస్వామి. ఆ తర్వాత పరిచూరి బ్రదర్స్ సూచన మేరకు లక్ష్మీనరసింహాగా మార్చారు.

దాదాపుగా 11 కోట్లతో ఈ సినిమా తెరకెక్కింది. ఆంధ్రావాలా ప్లాప్ కావడంతో నందమూరి అభిమానులు ఈ సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. లక్ష్మీనరసింహా ఓపెనింగ్ రోజున అభిమానులు ధియెటర్ల వద్ద భారీ హంగామా చేశారు. దీనితో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దియేటర్ల వద్ద పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా 272 కేంద్రాలలో 50 రోజులు, 87 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. టోటల్‌‌గా 17 కోట్ల వరకు ఈ సినిమా వసూళ్ళు సాధించింది.

అయితే లక్ష్మీనరసింహా రిలీజ్ అయిన అదే రోజున ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమా కూడా రిలీజైంది. దీనితో ఆ సంక్రాంతికి వర్షం సినిమా హిట్ గా నిలిచింది. అదే సంక్రాంతికి వచ్చిన చిరంజీవి అంజి సినిమా అట్టర్ ప్లాప్ అయింది.

Tags

Read MoreRead Less
Next Story