Bangarraju: 'బంగార్రాజు'కు సీక్వెల్ ఉంటుందా..? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

Bangarraju: బంగార్రాజుకు సీక్వెల్ ఉంటుందా..? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
Bangarraju: సోగ్గాడే చిన్నినాయన సినిమా ఎక్కడ ఆగిపోయిందో.. బంగార్రాజు అక్కడే మొదలయ్యింది.

Bangarraju: సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు ఉన్నా వాటన్నింటిని దాటి 2016లో బిగ్గెస్ట్ హిట్‌ను సాధించింది నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్నినాయన'. తండ్రీ, కొడుకులుగా నాగార్జున డబుల్ యాక్షన్ చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'బంగార్రాజు' కూడా ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందా అన్న అనుమానాలపై దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇటీవల ఓ క్లారిటీ ఇచ్చాడు.

సోగ్గాడే చిన్నినాయన సినిమా ఎక్కడ ఆగిపోయిందో.. బంగార్రాజు అక్కడే మొదలయ్యింది. బంగార్రాజులో ఒక నాగార్జున క్యారెక్టర్‌కు కొడుకుగా, మరో నాగార్జున క్యారెక్టర్‌కు మనవడిగా ఆకట్టుకున్నాడు నాగచైతన్య. ఇంతకు ముందు ఈ తండ్రీకొడుకులు కలిసి 'మనం' చిత్రంలో నటించారు. మరోసారి వీరిద్దరి స్క్రీన్ ప్రెసెన్స్.. బంగార్రాజుకు పెద్ద ప్లస్‌గా మారింది.

సోగ్గాడే చిన్నినాయనతో ఫ్యామిలీ దర్శకుడు అనిపించుకున్న కళ్యాణ్ కృష్ణ.. ఇంతకాలం ఎదురుచూసి మళ్లీ బంగార్రాజు లాంటి ఓ ఫ్యామిలీ చిత్రాన్నే ప్రేక్షకులకు అందించాడు. బంగార్రాజు తర్వాత కూడా సీక్వెల్‌‌కు ఛాన్స్ ఉందని ఇటీవల స్పష్టం చేశాడు ఈ దర్శకుడు. అయితే ఈ కథను హడావిడిగా సిద్ధం చేస్తే సరికాదని.. సరైన సమయం తీసుకుని కథను పూర్తిచేసి సెట్స్‌పైకి తీసుకెళ్తానని వివరించాడు కళ్యాణ్ కృష్ణ.

Tags

Read MoreRead Less
Next Story