సినిమా

Bangarraju Movie: కెరీర్‌లో మొదటిసారి సింగర్‌గా నాగ్.. పాట అదరగొట్టేశాడుగా..

Bangarraju Movie: ఒక సినిమా హిట్ అవ్వగానే దానికి సీక్వెల్ తెరకెక్కించాలి అనుకోవడం ట్రెండ్ అయిపోయింది.

Bangarraju Movie (tv5news.in)
X

Bangarraju Movie (tv5news.in)

Bangarraju Movie: ఒక సినిమా హిట్ అవ్వగానే దానికి సీక్వెల్ తెరకెక్కించాలి అనుకోవడం ట్రెండ్ అయిపోయింది. ప్రస్తుతం తెలుగులో చాలా తక్కువ సినిమాలకే సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. అందులో అన్నింటికంటే ఎక్కువగా హైప్ క్రియేట్ అయిన సినిమా 'బంగార్రాజు'. షూటింగ్‌ను శరవేగంగా పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా ఇటీవల ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. తాజాగా అందులో నుండి మొదటి పాట విడుదలయ్యింది.

'బంగార్రాజు'లో 'లడ్డుండా' అనే ఈ పాటు అటు క్లాస్.. ఇటు మాస్ మిక్సింగ్ లాగా అందరినీ అలరిస్తోంది. పైగా ఈ పాట కోసం అక్కినేని నాగార్జున మొదటిసారిగా సింగర్ అవతారం ఎత్తాడు. పాట మొదట్లో వచ్చే ఆయన వాయిస్ సాంగ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక పాట వీడియోలో నాగార్జున.. మన్మథుడిగా చాలామంది అమ్మాయిలతో కలిసి స్టెప్పులేశారు.

ఈ రీల్ లైఫ్ మన్మథుడు లడ్డుండా పాటతో మరోసారి తన ఛార్మ్‌ను చూపిస్తున్నారు. ఈ పాటకు అప్పుడే సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ మొదలయిపోయింది. బంగార్రాజు సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగచైతన్య ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. తనకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. లడ్డుండా పాటలో నాగ్ ఛార్మ్ సూపర్ అంటూ నాగచైతన్య ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం టీమ్ అంతా మైసూర్‌కు బయల్దేరారు.


Next Story

RELATED STORIES