సినిమా

Bangarraju : బంగార్రాజు బావ చూపులతోనే ఊచకోత.. ఎవరీ దేవకన్య?

Bangarraju : కొద్దిసేపటి క్రితమే అక్కినేని హీరోల మల్టీస్టారర్ మూవీ బంగార్రాజు ట్రైలర్ రిలీజ్ అయింది.

Bangarraju : బంగార్రాజు బావ చూపులతోనే ఊచకోత.. ఎవరీ దేవకన్య?
X

Bangarraju : కొద్దిసేపటి క్రితమే అక్కినేని హీరోల మల్టీస్టారర్ మూవీ బంగార్రాజు ట్రైలర్ రిలీజ్ అయింది. పల్లెటూరి నేపథ్యంలో సాగే సన్నివేశాలు, ఉర్రూతలూగించే పాటల క్లిప్‌లతో పండగ వాతావరణాన్ని ముందుగానే తీసుకొచ్చారు మేకర్స్.. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. దీనితో సినిమా పైన మరింత అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా ట్రైలర్ మొదట్లో స్వర్గంలో దేవకన్యలతో బంగార్రాజు కబడ్డీ ఆడుతున్నట్టుగా చూపించారు.

అందులో "బంగార్రాజు బావగారు చూపులతోనే ఊచకోత కోసేస్తారు మీరు" అంటూ ఓ డైలాగ్ హైలెట్ గా నిలిచింది. ఈ సన్నివేశం సినిమాలో బంగార్రాజు ఎంట్రీ సీన్ అని తెలుస్తోంది. అయితే ఈ సన్నివేశంలో డైలాగ్ హైలెట్ కావడంతో ఆ అమ్మాయి ఎవరా అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఆ హీరోయిన్ పేరు మీనాక్షి దీక్షిత్‌.. తెలుగు ప్రేక్షకులకి సుపరిచితురాలే.. 2009లో వచ్చిన జీవనశైలి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది.. ఆ తర్వాత మహేష్ బాబు దూకుడు సినిమా టైటిల్ సాంగ్ లో చేసింది. ఆ తర్వాత తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది కానీ హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకోలేకపోయింది.


అయితే ఇప్పుడు బంగార్రాజు మూవీలో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. బంగార్రాజు ఎంట్రీ సీన్ లో ఈమెతో పాటుగా దర్శన బానిక్‌, వేదిక, దక్ష నాగార్కర్‌, సిమ్రత్‌ కౌర్‌ కూడా కనిపించనున్నారు. ఇదిలావుండగా కృతిశెట్టి, రమ్యకృష్ణ హీరోయిన్లు గా నటిస్తోన్న బంగార్రాజు సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో, జీ స్టూడియోస్‌ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ నెల14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా పైన భారీ అంచనాలున్నాయి.


Next Story

RELATED STORIES