సినిమా

Krishna - Puri jagannadh : పూరీ మొదటి సినిమా ఇలా ఆగిపోయింది..!

Krishna - Puri jagannadh : ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత ఇండస్ట్రీలో స్టార్ హీరో అని పేరు తెచ్చుకున్న నటుల్లో హీరో కృష్ణ ఒకరు.

Krishna - Puri jagannadh : పూరీ మొదటి సినిమా ఇలా ఆగిపోయింది..!
X

Krishna - Puri jagannadh : ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత ఇండస్ట్రీలో స్టార్ హీరో అని పేరు తెచ్చుకున్న నటుల్లో హీరో కృష్ణ ఒకరు. డేరింగ్ అండ్ డాషింగ్ సినిమాలు తీయడంలో కృష్ణ మంచి దిట్ట. అందుకే అల్లూరి సీతారామరాజు లాంటి సినిమాలు ఆయన నుండి వచ్చాయి. ఇలాంటి హీరోకి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తోడైతే ఇంకెలా ఉంటుంది.

అవును ఆ సందర్భం 1996లో అయితే వచ్చింది కానీ సినిమా మాత్రం ఆగిపోయింది. డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన పూరీ.. రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌‌‌గా పనిచేశారు. ఒకపక్కా అసిస్టెంట్‌‌గా పనిచేస్తూనే సీరియల్స్‌‌ని డైరెక్షన్ చేసేవారు. అలా పూరీ టేకింగ్‌‌కి ఫిదా అయిపోయిన నిర్మాత ఐబీకే మోహన్‌ ఆయనతో ఓ సినిమా చేయడానికి రెడీ అయిపోయారు. కథ కూడా రెడీ.. హీరో కృష్ణకి వెళ్లి వినిపించారు.

పూరీ చెప్పిన స్టైల్ కూడా కృష్ణకి బాగా నచ్చింది. క్యాస్టింగ్ కూడా పూర్తయింది. 'థిల్లానా' అనే టైటిల్‌‌తో మూవీని లాంచ్ చేశారు. అయితే ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా రెండు సార్లు వాయిదా పడగా ఆ తర్వాత పూర్తిగా ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ కృష్ణతో సినిమాని ప్లాన్ చేయలేదు పూరీ.. కానీ కృష్ణ తనయుడు మహేష్ తో మాత్రం పోకిరి, బిజినెస్‌‌మెన్ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించారు పూరీ.

Next Story

RELATED STORIES