సినిమా

Bheemla Nayak: 'భీమ్లా నాయక్' పోస్ట్ పోన్ అవుతుందా? నిర్మాత క్లారిటీ..

Bheemla Nayak: పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం 'భీమ్లా నాయక్'.

Bheemla Nayak (tv5news.in)
X

Bheemla Nayak (tv5news.in)

Bheemla Nayak: పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం 'భీమ్లా నాయక్'. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యపనుమ్ కోషియుమ్'కు ఇది రీమేక్. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు రానా ఫ్యాన్స్‌ కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ముందు చెప్పిన తేదీకి విడుదల కావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

2022 సంక్రాంతి బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నవన్నీ పెద్ద సినిమాలే. అన్నీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అవుతున్నవే. వాటికి లాభాలు తెచ్చే కలెక్షన్స్ రావాలంటే దాదాపు రెండు వారాల వరకు మరో సినిమా విడుదల కాకూడదు. కానీ ఈసారి మూడు భారీ బడ్జెట్ సినిమాల్లో ఏ ఒక్కటీ కూడా సంక్రాంతి పోటీ నుండి తప్పుకోవడానికి సిద్ధంగా లేవు.

వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రభాస్ 'రాధే శ్యామ్', రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'తో పాటు పవన్ 'భీమ్లా నాయక్' ఒకేసారి విడుదల కానున్నాయి. ప్రస్తుతం అన్ని సినిమాలకు ఒకేలాగా హైప్ క్రియేట్ అయ్యింది. అభిమానులంతా వారి ఫేవరెట్ హీరోల సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పోటీ నుండి భీమ్లా నాయక్ తప్పుకుంటే బాగుంటుందని రాజమౌళి.. ఈ సినిమా నిర్మాతలను సంప్రదించినట్టు కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చాయి.

భీమ్లా నాయక్ సంక్రాంతి పోట నుండి తప్పుకుంటున్నట్టు ఓ వార్త వైరల్ అయ్యింది. దీంతో ఈ సినిమా నిర్మాత నాగవంశీ స్పందిస్తూ.. సినిమా ఫైనల్ కట్ చూశానని, జనవరి 12న కలుద్దామని క్లారిటీ ఇచ్చాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ కాస్త కుదుటపడ్డారు. 2022 సంక్రాంతి భారీ బడ్జెట్ సినిమాలతో బాక్సాఫీస్ పోటీ గట్టిగానే ఉండబోతుంది.


Next Story

RELATED STORIES