Bheemla Nayak : భారీ ధరకు అమ్ముడుపోయిన భీమ్లానాయక్ నాన్ థియేట్రికల్ రైట్స్ ..!

Bheemla Nayak :  భారీ ధరకు అమ్ముడుపోయిన భీమ్లానాయక్ నాన్ థియేట్రికల్ రైట్స్ ..!
Bheemla Nayak : పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతోన్నయాక్షన్ డ్రామా భీమ్లా నాయక్ .

Bheemla Nayak : పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతోన్నయాక్షన్ డ్రామా భీమ్లా నాయక్ .. వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 25)న భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈరోజుతో షూటింగ్ పూర్తి చేసుకుంది.


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నిత్యా మీనన్ మరియు సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. థమన్ ఎస్ సంగీతం సమకూర్చగా, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఇదిలావుండగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది.


హాట్ స్టార్ సంస్థ భీమ్లా నాయక్ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా సినిమాకి దాదాపు 70 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగినట్టు సమాచారం. పెట్టిన పెట్టుబడి దాదాపు సగానికి పైగా నాన్ థియేట్రికల్ గానే లాభాలు అంధించినట్లు తెలుస్తోంది.


కాగా మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్‌‌కి రీమేక్‌‌గా భీమ్లానాయక్ చిత్రం తెరకెక్కింది. గతేడాది వకీల్ సాబ్ సినిమాతో రికార్డ్స్ క్రియేట్ చేసిన పవర్ స్టార్ .. ఈ సారి భీమ్లానాయక్ సినిమాతో మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story