Bheemla Nayak Trailer: 'నాయక్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ'.. అందుకే ట్రైలర్ వచ్చేసిందిగా..

Bheemla Nayak Trailer: నాయక్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.. అందుకే ట్రైలర్ వచ్చేసిందిగా..
Bheemla Nayak Trailer: రెండున్నర నిమిషాల ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్, రానా పాత్రలు పోటీపోటీగా అదిరిపోయాయి.

Bheemla Nayak Trailer: మలయాళ సినిమాల్లో ఎప్పటికీ మర్చిపోలేని యాక్షన్ డ్రామాగా ఓ ల్యాండ్ మార్క్‌ను సెట్ చేసింది 'అయ్యపనుమ్ కోషియుమ్'. అదే సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు, హీరోలు ప్రయత్నించారు. కానీ చివరికి అది పవన్ కళ్యాణ్, రానా చేతికి వచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకు వీరు పర్ఫెక్ట్ ఛాయిస్ అని తాజాగా విడుదలయిన ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్రకు దర్శకుడిగా ఉన్న అనుభవం ఒక్క సినిమానే. అయినా కూడా పవన్ కళ్యాణ్, రానా లాంటి ఇద్దరు హీరోలను బాగానే హ్యాండిల్ చేశాడని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తోంది. పైగా రైటర్‌గా త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది.

రెండున్నర నిమిషాల ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్, రానా పాత్రలు పోటీపోటీగా అదిరిపోయాయి. అంతే కాకుండా పవన్ కళ్యాణ్‌కు భార్యగా నటించిన నిత్యా మీనన్ పాత్రకు కూడా సినిమాలో బాగానే స్కోప్ ఉన్నట్టుగా అనిపించింది. హై వోల్టేజ్ డైలాగులతో ట్రైలర్ నిండిపోవడం ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. సంయుక్త మీనన్, సముద్రఖని, మురళి లాంటి వారు సపోర్టింగ్ క్యారెక్టర్స్‌గా కనిపించనున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. చివరిలో రానా చెప్పే 'నాయక్.. నీ ఫ్యాన్స్ వెయింటింగ్ ఇక్కడ' అనే డైలాగు ట్రైలర్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది.

Tags

Read MoreRead Less
Next Story