సినిమా

Bhool Bhulaiyaa 2: హిందీలో 'చంద్రముఖి' సినిమా సీక్వెల్.. హీరోయిన్‌ ఎవరో తెలుసా..?

Bhool Bhulaiyaa 2: అక్షయ్ కుమార్, విద్యాబాలన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా హిందీలో కూడా మంచి హిట్‌నే అందుకుంది.

Bhool Bhulaiyaa 2: హిందీలో చంద్రముఖి సినిమా సీక్వెల్.. హీరోయిన్‌ ఎవరో తెలుసా..?
X

Bhool Bhulaiyaa 2: 'చంద్రముఖి' సినిమా ఒక్క భాషలో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఒక సెన్సేషన్నే క్రియేట్ చేసింది. ఇది ఫిక్షనల్ కథ కాదని.. నిజమేనంటూ జరిగిన ప్రచారం సినిమా హిట్‌కు పెద్ద ప్లస్‌గా మారి.. ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. తమిళంలో నుండి తెలుగులోకి డబ్ అయ్యి సూపర్ హిట్ సాధించిన సినిమాగా రికార్డ్ సాధించింది చంద్రముఖి. ఇప్పుడు ఈ సినిమా హిందీ సీక్వెల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది.

2005లో తమిళంలో విడుదలయిన 'చంద్రముఖి'.. తమిళంలోనే కాదు తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. అందుకే ఈ చిత్రాన్ని 'బూల్ బులయ్య' అనే పేరుతో హిందీలో తెరకెక్కించాడు దర్శకుడు ప్రియదర్శన్. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, అమీషా పటేల్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా హిందీలో కూడా మంచి హిట్‌నే అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోంది.

తమిళంలో జ్యోతిక చేసిన పాత్రను హిందీలో విద్యాబాలన్ చేసింది. తన పాత్ర బాలీవుడ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే బూల్ బులయ్య సీక్వెల్‌లో కూడా విద్యాబాలన్ మళ్లీ అదే పాత్రను పోషిస్తుందని బీ టౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కార్తిక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో విద్యాబాలన్ మరోసారి చంద్రముఖి పాత్రను చేస్తుందన్న వార్తలపై మూవీ టీమ్ ఏమీ స్పందించట్లేదు. అయితే మరోసారి 'ఆమీ జీ తోమర్' పాటకు డ్యాన్స్ చేసి విద్యాబాలన్ ప్రేక్షకులను మెప్పించనుందన్న వార్త ఆమె ఫ్యాన్స్‌ను హ్యాపీ చేస్తోంది.

Next Story

RELATED STORIES